పవన్ బీద అరుపులకు, ఫోర్బ్స్ లిస్ట్ కు సింక్ అవట్లేదు-కత్తి మహేష్

First Published 29, Dec 2017, 5:51 PM IST
kathi mahesh targets pawan kalyan again
Highlights
  • ఫోర్బ్స్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ పేరు రావటంపై స్పందించిన క్రిటిక్ కత్తి మహేష్
  • డబ్బులు లేవంటూ బీద అరుపులు అరిసే పవన్  ఫోర్బ్స్ లిస్ట్ లో ఎలా వుంటాడు
  • అసలు పవన్ సినిమా ఆదాయమెంత.. ఇతర ఆదాయమెంత అని నిలదీసిన కత్తి

వర్ స్టార్ పవన్ కళ్యాన్‌ను విమర్శిస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్న మహేష్ కత్తి.. మరోసారి ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఫోర్బ్స్ 2017లో సంపన్న సెలబ్రిటీల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వందమంది సెలబ్రిటీల్లో పవన్ కళ్యాణ్ కూడా స్థానం సంపాదించాడు. దీంతో పవన్ కళ్యాన్ గతంలో తన సంపాదనపై చేసిన వ్యాఖ్యలను ఎత్తి చూపుతూ.. మహేష్ కత్తి తన ట్విట్టర్ అకౌంట్లో విమర్శలు గుప్పించారు.


‘‘డబ్బులేదు డబ్బులేదు అని బీదఅరుపులు అరుస్తుంటాడు. మళ్ళీ ఫోర్బ్స్ రిచ్ లిస్టులో ఉంటాడు. ఇంతకీ ఇతడి ఆదాయం ఎంత? సినిమాల్లోంచి వచ్చేది ఎంత? పై ఆదాయం ఎంత? ఎక్కడి నుంచీ?’’ అని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనపై మండిపడ్డారు. అతని ఆదాయం ఎంతైతే నీకెందుకు? నీ దగ్గర డబ్బులు అడగడం లేదు కదా? అని కొందరు అంటుంటే, పవన్‌ను విమర్శించేందుకు వైసీపీ నుంచి నీకు భాగానే నిధులు అందుతున్నాయంటూ కామెంట్స్ చేశారు. ఇంకొందరు ఈ రోజు నిన్ను ఆ ‘టీవీ’ వాళ్లు పిలుస్తారు. వెళ్లి టైంపాస్ చెయ్యంటూ కామెంట్స్ చేశారు.

loader