దేశమంతా ఇప్పడు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో అయితే శ్రీరెడ్డి దెబ్బకి నెల రోజులు మామూలుగా రచ్చ జరగట్లేదు. ఇదంత జరుగుతున్న తరుణంలలో.. నిన్న ఒక ప్రముఖ ఛానెల్ లో జరిగి డిభేట్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత కత్తి మహేష్ పై కొన్ని ఆరోపణలు చేసింది. తనను కత్తి మహేష్ లోంగ తీసుకున్నాడంటు, రేప్ చేశాడంటు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఆరోపణలు చేసింది. పక్కనే ఉన్న కత్తి మహేష్ ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్పాడు. కానీ కంప్లైంట్ ఫైల్ అయితే చేయలేదు. కత్తి మహేష్ తనను వదలలేదు తన మీద అబద్ధపు ప్రచారం చేస్తుందంటు సునీతపై కోర్టు లో కేసు వేస్తానని చెప్పాడు.

తాను లాయర్ తో సంప్రదింపులు జరిపానని.. సోమవారం పరువునష్టం దావా వేయనున్నట్లుగా ప్రకటించారు. రూ.50 లక్షల రూపాయిలకు దావా వేయాలని చెప్పానని.. ఇందుకోసం కోర్టుకు రూ.5 లక్షలు డిపాజిట్ చెల్లించాలని లాయర్ చెప్పారని.. ఆ ఏర్పాట్లలో ఉన్నట్లు చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన సునీత అనే అమ్మాయి తనకు గతంలో పరిచయం ఉందని.. కానీ ఏ మాత్రం నిజం లేకున్నా.. ఒక కట్టుకథను అల్లి ఆమెను ఛానల్ కు పంపినట్లుగా ఆరోపించారు. తాను సైరా ఆఫీసు నుంచి వచ్చానని.. వాకాడ అప్పారావు పేరును ప్రస్తావించటం చూస్తే తనకు కొత్త సందేహాలు వస్తున్నట్లు చెప్పారు.

సైరా ఆఫీస్ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఆ అమ్మాయి వెనుక కొణిదెల ప్రొడక్షన్ హస్తం ఉందా?  లేదా?  అన్న సందేహాన్ని వ్యక్తం చేసిన కత్తి.. పవన్ కల్యాణ్ పై తాను చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. తనను కెలకొద్దని గతంలోనూ చెప్పారని.. ఇప్పుడు నేరుగా తన వ్యక్తిగత పరువును దెబ్బ తీయటానికి ప్రయత్నించిన నేపథ్యంలో తానిక ఉపేక్షించేది లేదన్నారు. రెండు.. మూడు రోజుల్లో తానుకొన్ని విషయాలు బయటపెడతానని.. వాటితో చాలామంది బతుకులు ఏమిటో అర్థమవుతాయన్నారు. తనపై ఆరోపణలు చేసిన అమ్మాయికి సరిగా కోచింగ్ ఇవ్వలేదని  ఎటకారం చేసిన కత్తి.. రెండు.. మూడు రోజులు వెయిట్ చేస్తే చాలా విషయాలకు సమాధానాలు దొరుకుతాయని.. చాలామంది మంది బతుకులేందో అందరికి తెలుస్తాయని.. అందుకు పెద్ద సమయం లేదని కత్తి స్పష్టం చేశారు. ఇంతకీ.. కత్తి దగ్గర ఉన్న ఆ సమాచారం ఏమిటి?  వాటితో మెగా.. పవర్.. మెగాపవర్ లాంటి వారికి సంబంధించినవా?  లేక వేరే వారివా? అన్నది ఇప్పుడు పరశ్నగా మారిందని చెప్పక తప్పదు. శ్రీరెడ్డి వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందనుకుంటున్న వేళ.. కత్తి అల్టిమేటం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.