ఆమెపై పరువునష్టం దావా వేస్తా : కత్తి మహేష్

kathi mahesh fires on artist sunitha and on konidala productions
Highlights

ఆమెపై  పరువునష్టం దావా వేస్తా  : కత్తి మహేష్

 లైంగికంగా వేధించాడంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేసిన జూనియర్ ఆర్టిస్ట్ సునీతపై పరువునష్టం దావా వేస్తానని సినీ విమర్శకుడు కత్తి మహేష్ తెలియచేశాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన..తనపై ఆరోపణలు చేయాలని కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ కూడా సునీతను ప్రోత్సహించిందని అన్నారు.

సహాయంకోసం వెళ్ళిన తనను కత్తి మహేష్ లైంగికంగా వేధించాడని, గది తలుపులు మూసేశాడని సునీత టీవీ 9 చర్చా కార్యక్రమంలో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను కత్తి మహేష్ తోసిపుచ్చాడు. కుట్రలో భాగంగానే ఆమె ఈ ఆరోపణలు చేసిందని పేర్కొన్నాడు.

 

loader