జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సినీ విమర్శకుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఒంగోలులో విలేకరులతో మాట్లాడిన ఆయన ఇటీవల పవన్ ఓ సభలో చేసిన వ్యాఖ్యలను విమర్శించారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సినీ విమర్శకుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఒంగోలులో విలేకరులతో మాట్లాడిన ఆయన ఇటీవల పవన్ ఓ సభలో చేసిన వ్యాఖ్యలను విమర్శించారు.

పవన్ తనకి ప్రాణహాని ఉందని చెప్పడం ఆయన రాజకీయ పరిణతిని తెలియజేస్తుందని అన్నారు. శ్రీరెడ్డి ఉదంతం జరిగినప్పుడు ఆమె పోలీసులను ఆశ్రయించాలని వెల్లడించిన పవన్ తనపై కుట్ర జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేయలేదని ప్రశ్నించారు.

నిజంగానే అతడికి ప్రాణహాని ఉంటే ప్రభుత్వాన్ని భద్రత ఎందుకు కోరలేదని అడిగారు. దళితుల్లో కొత్త నాయకత్వం తీసుకురావడానికి తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో దళిత, గిరిజనుల హక్కులని కాపాడే పార్టీ తరఫున రాష్ట్రంలోని ఒక పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయనున్నట్లు కత్తి మహేష్ స్పష్టం చేశారు.