ఫాస్టెస్ట్ 5 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. పవన్ పక్కా మాస్ లుక్ లో ఫ్యాక్షనిస్ట్ గా కనిపిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు యూట్యూబ్ రికార్డ్స్ బద్దలవుతున్నాయి. ఫాస్టెస్ట్ వన్ మిలియన్ వ్యూస్ రికార్డ్ ను సొంతం చేసుకున్న కాటమరాయుడు టీజర్, కేవలం 57 గంటల్లో 50 లక్షలకు పైగా వ్యూస్ సాధించి టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డ్ ను సృష్టించింది.

