ప్రస్తుతం బాలీవుడ్ లో  బయోపిక్స్ అండ్ రీమేక్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.  ముఖ్యంగా మన తెలుగు,తమిళ భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను మరో భాషలో అక్కడ నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టడం కలిసివస్తోంది. రీసెంట్ గా అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ సైతం సూపర్ హిట్ అవటం ఈ ట్రెండ్ కు ఊతమిస్తుంది.

తమిళ్‌లో తల అజిత్ నటించగా సూపర్ హిట్ అయిన వీరమ్ మూవీని తెలుగులో కాటమరాయుడుగా పవన్ తో చేసారు.  వీర‌మ్ భారీ విజ‌యాన్ని సాధించ‌డంతో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించింది. ఈ క్ర‌మంలో వీర‌మ్ చిత్రాన్ని రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాల‌నుకుంటున్నాడు అక్ష‌య్. దాంతో బాలీవుడ్‌లో ‘బచ్చన్‌ పాండే’టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.

సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తుండగా.. ఫర్హాద్ సామ్జి డైరెక్ట్ చెయ్యనున్నాడు. ప్రస్తుతం హిందీ నేపథ్యానికి తగ్గట్టు స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసారు.  ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడు దల చేయనున్నట్లు ప్రకటించారు.   ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం లక్ష్మీబాంబ్, సూర్యవన్షీ సినిమాలతో బిజీగా ఉన్నారు అక్షయ్‌. అలాగే ఆయన నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.