కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో కాటమరాయుడు టీజర్లుంగీలో అదరగొడుతున్న పవర్ స్టార్ 

నూతన సంవత్సరం సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుగానే కానుక అందించారు. పవర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడుకు సంబంధించిన లెటెస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ లుంగీ, కిర్రు చెప్పులతో దర్జాగా నడుస్తున్న ఫోజ్ లో లుక్ ఇచ్చారు. ఇక పోస్టర్ పై నూతన సంవత్సర శుభాకాంత్రలు తెలుపుతూ హ్యాపీ న్యూ ఇయర్ 2017 అని ప్రింట్ చేశారు. పవర్ స్టార్ మొన్న క్రిస్ మస్ రోజున కూడా అభిమానులకు, తెలుగు ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.