చిత్రం : కాటమరాయుడు నటీనటులు : పవన్‌ కల్యాణ్‌, శృతిహాసన్‌,శివబాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు, నాజర్‌, అలీ, రావు రమేష్‌, ప్రదీప్‌ రావత్‌, తరుణ్‌ అరోరా, తదితరులు సంగీతం : అనూప్‌ రూబెన్స్‌ దర్శకత్వం: డాలీ నిర్మాత: శరత్‌ మరార్‌ బ్యానర్ :నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ ఏసియానెట్ రేటింగ్ : 4/5

కథ :

కాటమరాయుడు (పవన్ కల్యాణ్) తన ఊళ్లో పవర్ ఫుల్‌ పర్సనాలిటీ. తన నలుగురు సోదరులతో ఊళ్లో నివసిస్తుంటాడు. అజయ్, శివబాలాజీ, కమల్, చైతన్య కామరాజు సోదరులుగా కనిపించారు. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాటమరాయుడికి పెళ్లి అంటే పడదు. అయితే తాము ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే ముందు అన్నయ్య కాటమరాయుడు పెళ్లి జరగాలని భావించి అతని సోదరులు కాటమరాయుడును ప్రేమలో దింపాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో అవంతిక (శ్రుతిహాసన్) ప్రేమలో పడేలా చేస్తారు. మొత్తానికి కాటమరాయుడు తమ్ముళ్లు చెప్పిన అబద్ధాలతోనే ప్రేమలో పడ్డ అవంతిక కాటమరాయుడు గురించి తాను విన్నదంతా అబద్ధమని తెలుసుకుని బాధతో తిరిగి తన ఇంటికి వెళ్తుంది.

కాటమరాయుడు తన ప్రేమ కోసం గతమంతా వదిలేసి అవంతిక కోసం మారిన మనిషిలా ఆమె ఊళ్లోకి వెళతాడు. ఆమె ఇంటివద్దే ఉంటూ అవంతిక తండ్రి వద్ద మంచి పేరు కొట్టేందుకు కాటమరాయుడు ఏం చేశాడు... అవంతికను చంపేందుకు వచ్చిన విలన్ లను ఎలా అంతంచేశాడు.. అవంతిక కుటుంబాన్ని శత్రువుల నుంచి కాపాడేందుకు ఏం చేస్తాడు. చివరికి అవంతికను పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. 

నటీనటులు :

కాటమరాయుడు అనగానే ముందుగా చెప్పుకోవాల్సింది లీజ్ రోల్ లో నటించిన హీరో పవన్ కళ్యాణ్ గురించే. టైటిల్ రోల్ కు ఉండాల్సిన మేనరిజం పవన్ కల్యాణ్ పక్కాగా చూపించాడు. ఫ్యాన్స్ అంచనాలకు తగిన నటన, డ్యాన్స్ అదరగొట్టేశాడు. ఇక హీరోయిన్ శ్రుతిహాసన్ నటన అదిరింది. గతంలో ఎన్నడూ లని విధంగా తన పరువాలను ఆరబోయటంలో శృతి కాస్త శృతిమించడం వీక్షక మహాశయులను అలరిస్తుంది. రావు రమేష్, నర్సప్ప తమ తమ పాత్రల్లోనే జీవించారు. అలీ, పృధ్వీల కామెడీ అదిరింది. ఇక పవన్ సోదరులుగా అజయ్, శివ బాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రుతిహాసన్ తండ్రిగా నాజర్ కుదిరిపోయాడు. కాటమరాయుడు కథ పాతదే అయినా..సరికొత్త స్క్రీన్ ప్లే, డైలాగులు ఆక్టటుకుంటాయి.

ఎలా ఉందంటే :

ఒక పవర్ ఫుల్ కేరక్టర్ ను నరేట్ చేయడం అంత ఈజీ కాదు.. అయితే... దర్శకుడు డాలీ (కిశోర్ పార్థసాని) కాయమరాయుడును చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అదే విధంగా ఒక పవర్ ఫుల్ విలన్ ను మంచి వాడిగా మారితే చూడొచ్చు కానీ.. మరీ కమెడియన్ గా మార్చేసి క్లైమాక్స్ లో నవ్వులు పండించాడు దర్శకుడు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఆక్టటుకుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్, స్టంట్స్, యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ విలువలు, ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రాఫీ కథకు సరిపోయింది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా కనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

పవన్ కల్యాణ్ తనదైన మేనరిజంతో చూపిన నటన, ఫైట్స్, శృతీ హాసన్ అందం, కాటమరాయుడును ప్రేమలో పడేసేందుకు తమ్ముళ్లు చేసిన నవ్వు తెప్పించే కామెడీ

మైనస్ పాయింట్స్ : 

కథలో కొత్తదనం లేకపోవడం

చివరగా :

పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్, పవన్ ఫ్యాన్స్‌ కు కాటమరాయుడు నచ్చుతాడు.