అమెరికాకు పవన్ కళ్యాణ్ బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 2017కు పవన్ పవన్ అమెరికా పర్యటనతో కాటమరాయుడు షూటింగ్ కొన్ని రోజులు వాయిదా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అమెరికాలో పర్యటనకు వెళ్లారా.. అంటే అవుననే తెలుస్తోంది. పవన్ అమెరికా వెళ్లినట్టు సమాచారం. బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 2017లో పవన్ పాల్గొంటారు. పవన్‌తో పాటు మరో స్టార్ మాధవన్ కూడా ఈ సదస్సుకు హజరుకానున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ కార్యక్రమానికి వక్తగా వ్యవహరించనున్నారు.
ఈ నెల 11, 12 తేదీలలో.. హర్వర్డ్ యూనివర్సిటీలో 14వ ఇండియా కాన్ఫరెన్స్ 2017 ఫిబ్రవరి 11, 12 తేదీలలో జరుగనున్నది. ఈ సదస్సుకు ఆహ్వానం అందడంపై పవన్ కల్యాణ్, మాధవన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. యువతకు స్ఫూర్తినిచ్చేలా పవన్ కల్యాణ్ స్పీచ్ ఇండియా కాన్ఫరెన్స్ సదస్సులో యువతలో స్ఫూర్తిని నింపే విధంగా పవన్ ప్రసంగం ఉంటుందనే అభిప్రాయాన్ని జనసేన వర్గాలు వెల్లడించాయి.
ఏపీలో జనసేనను బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న క్రమంలో ఈ సదస్సులో పాల్గొనే అవకాశం పవన్ రావడం సానుకూల అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ ప్రపంచ వేదిక ద్వారా పవన్ చేసే ప్రసంగం జనసేన బలోపేతానికి సహకారం అందించే అవకాశముంది. ప్రపంచ వేదికపై జన సేనాని ప్రసంగం హార్వర్డ్ వర్సిటీ సదస్సు తర్వాత ఉత్తర అమెరికాలోని భారత సంతతికి చెందిన వారిని పవన్ కలువనున్నారు.
న్యూ హాంఫ్‌షైర్ లోని నాషువా పబ్లిక్ హైస్కూల్ సౌత్ లో జరుగనున్న సభకు వెళ్లేందుకు పలు వాహనాలతో ర్యాలీ నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ అనంతరం ప్రవాసాంధ్రులతో భేటీ కానున్నారు.
పవన్ అమెరికా పర్యటన నేపథ్యంలో నిర్విరామంగా జరుగుతున్న కాటమరాయుడు షూటింగ్ కొన్ని రోజులు బ్రేక్ పడనుంది. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 29న విడులయ్యేందుకు సిద్ధమవుతున్నది.
