కాటమరాయుడు బెనిఫిట్ షోలపై సాయంత్రమైనా దొరకని క్లారిటీ., అయితే తెల్లవారు జాము 3 గంటలకు షో ఉంటుందని సమాచారం ఉ,3గంటలకు కాటమరాయుడు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటున్న పవర్‌స్టార్‌ అభిమానుల పిచ్చ పీక్స్ కు వెళ్తోంది. రేపు ఉదయం ఆటతో సినిమా అధికారికంగా విడుదలవుతున్నా... ఇప్పటి వరకు కనీసం ఎక్కడా బెనిఫిట్ షోలకు సంబంధించిన క్లారిటీ రాకపోవడంతో అభిమానులు మాంచి చిర్రెత్తుతున్నారు. ఎర్లీగా చూసేయాలని ఫాన్స్‌ బెనిఫిట్‌ షోల కోసం చూస్తున్నా షోలకు సంబంధించి మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. 

ఫలానా థియేటర్‌లో షో వేసుకుంటామంటూ ప్రదర్శనకారులు ఇప్పటికే పర్మిషన్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే పోలీసుల నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇటీవల బెనిఫిట్‌ షోల విషయంలో పోలీసులు, ప్రభుత్వాలు స్ట్రిక్టుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వచ్చిన ఏ సినిమాకీ బెనిఫిట్‌ షోలకి పర్మిషన్లు ఇవ్వలేదు. 

పండగ టైమ్‌ కాదు కనుక ఇప్పుడు ఇబ్బంది వుండదని అనుకున్నారు కానీ ఇంతవరకు అయితే పోలీసులు దిగి రాలేదు. ఓవైపు బెనిఫిట్‌ షో వేసుకోవడానికి లక్షల్లో థియేటర్లకి చెల్లించిన వాళ్లు షో వుంటుందా వుండదా అనే అనుమానంతో కాస్త ఆందోళనగా వున్నారు. ఈ నేపథ్యంలో కాటమరాయుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడో చూడాలి.

అయితే... ముందుగా హైదరాబాద్ బ్రమరాంబలో ఉదయం 3గంటలకు షో ఉంటుందని, జిల్లాల్లో కూడా అదే సమయానికి షో మొదలు పెడతారని టాక్.