అనుకుంటాం కాని మనం చేసే పనుల మీద నియంత్రణ లేకపోతే ఇబ్బందులు తప్పవు. దానికి సినిమా హీరొయిన్లు మినహాయింపు కాదు. ఏదైనా చెప్పేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం చాలా అవసరం. అది మర్చిపోతే చిక్కులు ఎలా ఉంటాయో అన్నమయ్య హీరొయిన్ కస్తూరికి బాగా తెలిసివస్తోంది. శ్రీదేవికి సంతాప సూచకంగా అందరు తమ ట్విట్టర్ ఫేస్ బుక్ ఇన్స్ టాగ్రామ్ అకౌంట్స్ లో విచారం వ్యక్తం చేస్తుంటే కస్తూరి వ్యంగ్యంగా కామెడీ చేయబోయి అభాసు పాలు కావడం ఇప్పుడు టాక్ అఫ్ ది సోషల్ మీడియాగా మారింది. గత మూడు రోజులుగా శ్రీదేవి మరణం గురించి జరిగినంత చర్చ మీడియా చూపిన ఆసక్తి ఈ మధ్య కాలంలో దేని మీద చూపలేదు అన్నది నిర్వివాదాంశం. బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ దాకా ప్రతిఒక్కరు ఈ విషాదంపై స్పందించారు.

కాని నటి కస్తూరి ఈ టైంలో కామెడీ చేస్తే తనను అందరూ గుర్తిస్తారు అనుకుంది కాబోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న ఒక జోక్ ని తన ట్విట్టర్ లో షేర్ చేసేసింది. దాని ప్రకారం శ్రీదేవి చనిపోయారు కాబట్టి ఆవిడ పాటలు సన్నివేశాలు వేస్తున్నారు ఒకవేళ సన్నీ లియోన్ కనక పోతే ఏం వేస్తారు అంటూ స్మైలీ ఏమోజి పెట్టి ట్వీట్ చేసింది. ఇంకేముంది దాన్ని చూసిన నెటిజెన్లకు అరికాలు మంట నెత్తికెక్కింది. కామెంట్స్ లో తన మీద విరుచుకుపడ్డారు. ఒకవేళ ఇదే కామెంట్ ఒక మగాడు చేసి ఉంటే మహిళా సంఘాలు ఎంత రచ్చ చేసేవో కదా అని ఒక యువకుడు ప్రశ్నిస్తే మరొక యువకుడు సన్నీ లియోన్ వెనుక కూడా గుండెలు మెలితిప్పే కథ ఉందని ఇలా పోస్ట్ చేయటం అనుభవం ఉన్న నటి చేయాల్సిన పని కాదని చురక వేసాడు.

మరో యువకుడు మైండ్ బ్లాంక్ అయ్యే పోస్ట్ పెట్టాడు. గతంలో కస్తూరి నటించిన  పాటల్లోని హాట్ హాట్ స్పైసి బిట్స్ అన్నిస్క్రీన్ షాట్స్ రూపంలో పోస్ట్ చేసి ముందు వీటి సంగతి చూడండి మర్యాదగా డిలీట్ చేయకపోతే ఇలాంటివి చాలానే వస్తాయని సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చి పారేసాడు. నిజంగా అందులో కస్తూరి స్టిల్స్ చూస్తే సన్నీని తలదన్నేలా ఉన్నాయి. ఇంత ముప్పేట దాడి జరిగినా కస్తూరి తొణక్కుండా ట్వీట్ అలాగే ఉంచి ప్రతి దానికి రీ కౌంటర్ ఇవ్వడం విశేషం. తాను కేవలం సరదాకు మాత్రమే ఇది పోస్ట్ చేసానని అంతకు మించి వేరే దురుద్దేశం ఏది లేదని పదే పదే కవర్ చేసే ప్రయత్నం చేసింది .

అయినా ఒక లేడీ సూపర్ స్టార్ మరణానికి దేశం అంతా విచారిస్తూ ఉంటే కస్తూరి ఇది సరదాకు పెట్టాను అని చెప్పడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. పోనీ కస్తూరి శ్రీదేవికి సమకాలికురాలో లేక అంతకు మించో అయితే ఏదో పొగరులే అని సర్డుకోవచ్చు. శ్రీదేవితో ఏ రకంగా పోల్చుకున్నా పాతిక శాతం కూడా సరితూగని కస్తూరి లాంటి హీరొయిన్ ఇలా కామెంట్ పెట్టడం మాత్రం ముమ్మాటికి తప్పే. నివాళి కోసం నేరుగా వెళ్లకపోయినా పర్వాలేదు కాని చేతిలో సెల్ ఫోన్ అందులో ట్విట్టర్ ఎకౌంటు ఉంది కదా అని వాట్స్ అప్ లో జోకులను ఇలా పెద్దవాళ్ళకు ఆపాదించి పెడితే ఇలాంటి అవమానాలే ఎదుర్కోవాల్సి ఉంటుంది.