మన్మధుడు నాగార్జున అంటే ఓ తరంలో చాలా మంది ఆడపిల్లలకు క్రష్. ఆయనతో మాట్లాడాలని,షేక్ హ్యాండ్ ఇవ్వాలని, అవకాసం ఉంటే ఓ హగ్ ఇవ్వాలని తహతహలాడిపోయేవారు. అఫ్ కోర్స్ ఇప్పటికి ఆ హవా నడుస్తోందనుకోండి. అయితే ఆ విషయాలను ఎవరూ బయిటకు చెప్పుకోరు. కాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కస్తూరి...నాగార్జనతో తనకు ఉన్న క్రష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది..
 
 నటి కస్తూరి.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత చిలక్కొట్టుడు , ఆకాశ వీధిలో మొదలగు సినిమాలలో హీరోయిన్ గా నటించింది కానీ అవి ఆమెకి పెద్దగా పేరు తీసుకురాలేదు. ప్రస్తుతం కస్తూరి గృహలక్ష్మి అనే సీరియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. రీసెంట్ గా అలీతో జాలీగా అనే పోగ్రామ్ లో ఆమె వచ్చి ఇంట్రస్టింగ్ విషయం రివీల్ చేసింది. ఆమె మాట్లాడిన మాటలను నాగ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

కస్తూరి మాట్లాడుతూ...ఇప్పటివరకూ నేను చాలా మంది హీరోలతో కలిసి నటించాను.. కానీ క్రష్‌ మాత్రం హీరో నాగార్జున మీదనే అంటూ చెప్పుకొచ్చింది... మోడలింగ్‌ చేస్తున్న సమయంలో ఆయనని ఒకసారి కలిశానని, అప్పుడు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చానని, అలా ఆ చేతిని కడగకుండా 24గంటలు ఉంచాను, చివరకు ఆకలి వేసినప్పుడు తప్పక వేరే దారిలేక కడుక్కున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

 ఇక క్రికెట్ లో నాకు ధోని అంటే ఇష్టమని, అయితే, ధోనిని చూసినప్పుడల్లా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ గుర్తొస్తున్నాడంటూ చెప్పుకొచ్చింది. అయితే ఏ హీరోకైనా తల్లిగా నటిస్తారా అన్న ప్రశ్నకి కస్తూరి స్పందిస్తూ.. చేస్తాను కానీ ఆ హీరో తండ్రిగా, కొడుకుగా డబుల్‌ యాక్షన్‌ చేయాలంటూ చాలా తెలివిగా జవాబు ఇచ్చింది.. ఇక హీరోలలో విజయ దేవరకొండకు తల్లిగా అస్సలు చేయనని, విజయ్ అంటే చాలా క్రష్ అని చెప్పుకొచ్చింది. ఇక బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ జెనీలియా పోషించిన పాత్ర తన నిజజీవితానికి దగ్గరగా ఉంటుందని చెప్పుకొచ్చింది.