Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్‌తో సినిమా అంటే అది ఉండాల్సిందే.. యంగ్‌ హీరో కార్తికేయ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

హీరో కార్తికేయ `బెదురులంక`తో ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు `భజేవాయు వేగం`తో వస్తున్నాడు. బలమైన పాత్ర, యాక్షన్‌ ఉన్న పాత్ర దొరికితే ప్రభాస్‌తోనూ సినిమాకి రెడీ అంటున్నాడు. 
 

Kartikeya said that ready to do movie with Prabhas as villain arj
Author
First Published May 29, 2024, 6:22 PM IST

యంగ్‌ హీరో కార్తికేయ `ఆర్‌ఎక్స్ 100`తో హిట్‌ కొట్టి టాలీవుడ్‌లో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయ్యాడు. ఆ సినిమా తర్వాత ఆయనకు హిట్లు రావడం లేదు. సినిమాలన్నీ వరుసగా పరాజయం చెందాయి. చివరగా `బెదురులంక` కాస్త ఫర్వాలేదు. ఇప్పుడు `భజే వాయు వేగం` చిత్రంతో వస్తున్నారు. ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. యూవీ క్రియేషన్స్ లో వస్తోన్న ఈ మూవీ ఈ నెల 31న విడుదల కాబోతుంది. 

ఈ సందర్భంగా హీరో కార్తికేయ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, నెగటివ్‌ రోల్స్ చేయడంపై స్పందించారు. అజిత్‌తో `వాలిమై` సినిమాలో విలన్‌గా చేయడం వల్ల తనకు ప్లస్సే అయ్యిందని, కోలీవుడ్‌లో తనని గుర్తిస్తున్నారని, ఏదైనా సినిమా చేస్తే అక్కడ కూడా రిలీజ్‌కి అవకాశం ఉంటుంది. పైగా అజిత్‌ సినిమాలో విలన్‌గా అంటే ఆ పేరు వేరే లెవల్‌. అలాగే నానితో `గ్యాంగ్‌లీడర్‌` చిత్రం చేశాను. అది కూడా తనకు ఎంతో మంచి పేరు తెచ్చింది. యూఎస్‌లోనూ తనని గుర్తించేలా చేసిందన్నారు కార్తికేయ. 

ఈ క్రమంలో ప్రభాస్‌ తో సినిమా చేయాల్సి వస్తే, విలన్‌గా చేస్తారా? సపోర్టింగ్‌ రోల్‌ చేస్తారా అనే ప్రశ్నకి, వచ్చే స్క్రిప్ట్ ని బట్టి సినిమా చేస్తానని తెలిపారు కార్తికేయ. నెగటివ్‌ రోల్‌ అయితే ఆయనతో ఆ స్థాయిలో యాక్షన్‌ సీన్లు ఉండాలని కోరుకుంటాను. అలాంటి యాక్షన్‌ ఉంటే విలన్‌గా చేసేందుకు సిద్ధమే అని తెలిపారు. అయితే అది సాధ్యమా అనేది ఆలోచించాలన్నారు. 

ఇక ప్రస్తుతం ఆయన నటించిన `భజే వాయు వేగం` చిత్రం గురించి చెబుతూ, ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ సాగుతుందని తెలిపారు. `ఇందులో హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. ఈ కథ దర్శకుడు ప్రశాంత్ చెప్పినప్పుడు కార్తి హీరోగా నటించిన `ఖైదీ టైపులో ఊహించుకున్నాను. `ఖైదీ`లో ఉన్నంత యాక్షన్ ఈ మూవీలో ఉండదు కానీ అలాంటి ఎమోషనల్ డ్రైవ్, హీరోకు ఒక ప్రాబ్లమ్, అతనికుండే ధైర్యం ఇలాంటి ఫ్రేమ్ లో కథ ఉంటుంది. సెకండాఫ్ లో రేసీ స్క్రీన్ ప్లేతో మూవీ సాగుతుంది` అని తెలిపారు కార్తికేయ. 

`హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన ట్విస్టులేవీ `భజే వాయు వేగం` సినిమాలో ఉండవు. ఆమెది ఇంపార్టెంట్ రోల్. కథను ముందుకు తీసుకెళ్తుంటుంది. ట్రైలర్ లో ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన షాట్స్ తక్కువగా ఉన్నాయంటే కారణం ఆమెకు సంబంధించిన షాట్స్ పెడితే కథ రివీల్ అవుతుంది. ట్రైలర్ హీరో అడాప్ట్ చేసుకున్నకొడుకుగా చూపించాం. అక్కడే కథ మొదలవుతుంది. నా దృష్టిలో ఫైట్స్ చేయడం, విలన్ ను ఎదిరించడం ఎలా హీరోయిజమో. తండ్రి కోసం నిలబడటం, నా అనుకున్న వాళ్ల కోసం ఎక్కడిదాకా అయినా వెళ్లడం, ప్రేమించిన అమ్మాయి కోసం పోరాటం చేయడం కూడా హీరోయిజమే. "భజే వాయు వేగం" ఫస్టాఫ్ లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు. సెకండాఫ్ లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనేది చూపిస్తున్నాం` అని చెప్పారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios