`ఆర్‌ఎక్స్ 100`తో ఆకట్టుకుని సంచలన హీరోగా నిలిచిన కార్తికేయ సక్సెస్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన గత చిత్రాలు డిజప్పాయింట్‌ చేశాయి. ఇప్పుడు `బెదురులంక 2012` చిత్రంతో మరో ప్రయత్నం చేస్తున్నారు.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన `బెదురులంక 2012` ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. సినిమాపై మంచి బజ్‌ ని ఏర్పడింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు క్లాక్స్. ఆయన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్‌జీవీ వద్ద, సుధీర్ వర్మ వద్ద డైరెక్షన్‌ డిపార్ట్ మెంట్‌లో పనిచేసిన క్లాక్స్.. తొలి ప్రయత్నంగా `బెదురులంక` చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ ట్రైలర్‌ ఆకట్టుకోవడంతో అందరి దృష్టి ఆకర్షించాడు దర్శకుడు. సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుంది. తాజాగా ఆయన సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

ఈ సినిమాని జపాన్‌ సినిమా పితామహుడు రూపొందించి ది గ్రేమ్‌ మూవీ `సెవెన్‌ సమురాయ్‌` సినిమా స్ఫూర్తితో తెరకెక్కించాడట. ఆ సినిమాలోని ఓ మెయిన్‌ అంశాన్ని స్ఫూర్తి పొంది ఈ మూవీ కథ రాసుకున్నారట. అంతేకాదు హాలీవుడ్‌లో యుగాంతం ప్రధానంగా వచ్చిన `2012` కూడా కూడా స్ఫూర్తిగా తీసుకున్నట్టు తెలిపారు. ఇక యుగాంతం వస్తుందంటే బెదురులంక అనే విలేజ్‌లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, అక్కడి జనం ఎలా రియాక్ట్ అయ్యారు? అనేది ప్రధానంగా సాగుతుంది. డ్రామా కామెడీ మేళవింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలిపారు.

దర్శకుడు క్లాక్స్ చెబుతూ, `సినిమా అంతా ఫిక్షనల్ ఐలాండ్‌లో జరుగుతుంది. మేం 'ఎదురులంక' అని ఓ ఊరిలో షూటింగ్ చేశాం. బోర్డులపై 'బెదురులంక' అని రాశాం. ఎందుకంటే... కథలో ఓ ఫియర్ ఉంటుంది. దానిని కంటిన్యూ చేసేలా ఆ పేరు పెట్టాం. నాకు అకిరా కురసోవా 'సెవెన్ సమురాయ్' చాలా ఇష్టం. అందులో ఓ డైలాగ్ ఉంటుంది. రేపు ఉండదని అన్నప్పుడు... సమాజం ఏమనుకుంటుందో మనం పట్టించుకోము. ఆ మాట నచ్చింది. ఆ పాయింట్ మీద ఏదో ఒకటి తీయాలని అనుకున్నా. అప్పుడు హాలీవుడ్ సినిమా '2012' వచ్చింది. ఆ రెండిటి స్ఫూర్తితో పల్లెటూరి నేపథ్యంలో కొత్త కథ రాశా. డ్రామెడీ జానర్ సినిమా తీశా. సందేహం కూడా అంతర్లీనంగా ఉంటుంది తప్ప వినోదం, డ్రామా ఎక్కువ ఉంటుంది. తెరపై పాత్రల కంటే ప్రేక్షకుడికి ఎక్కువ కథ తెలుస్తుంది. దాంతో వినోదం బావుంటుంద`న్నారు.

కార్తికేయ గురించి చెబుతూ, `ఊరిని ఎదిరించే కుర్రాడిగా ఆయన కనపడతారు. ఆయన మీద ఓ షాట్ తీస్తే, ప్రేక్షకులు ఈజీగా నమ్ముతారు. నేను ఆయనకు చెప్పింది ఒక్కటే, మీ బాడీ లాంగ్వేజ్ ఫైటర్ లా కాకుండా డ్యాన్సర్ లా ఉంటే బావుంటుందని చెప్పా. ఆయన చాలా బాగా చేశారు. నేహా శెట్టిని డీజే టిల్లు' విడుదల తర్వాత ఎంపిక చేశాం. ఆమె అయితే బావుంటుందేమో ఓసారి చూడు అని నిర్మాత చెప్పారు. మాది పల్లెటూరి నేపథ్యంలో సినిమా. నేహా శెట్టి బాగా ఫెయిర్. సూట్ అవుతారో? లేదో? అని సందేహించా. తర్వాత లుక్ టెస్ట్ చేశాం. ఓకే అనుకున్నాం. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడ సర్‌ప్రైజ్ చేశారు. నేహా శెట్టి అందమైన నటి. చాలా చక్కగా నటించారు. సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్‌ సభ్యులు అభినందించారు` అని తెలిపాడు. ఇక ఈ చిత్రాన్ని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు.

YouTube video player