సెలబ్రిటీలు కూడా ఒక్కొక్క సారి  చిన్న చిన్న తప్పులు చేసి దొరికిపోతుంటారు. అయితే ఒక్కోసారి వాళ్లు చేయని తప్పకుకూడా బ్లేమ్ అవుతుంటారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ కు ఇలాంటి పరిస్థితే వచ్చింది. 

రాగ్ రూట్ లో వెళ్లడం.. డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసుల్లోసెలబ్రిటీలు ఇరుక్కోవడం కామన్ గా జరిగేదే. చాలా మంతి తారులు ఇలానే పోలీసులకు చిక్కి.. జైలుపాలు అయినవారు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ డ్రైవర్ చేసిన పనికి.. తాను ఇరుక్కున్నాడు. ఆయన డ్రైవర్ చేసిన తప్పుకు కార్తీక్ కారుకు ఫైన్ వేశారు ముంబై పోలీసులు. అంతే కాదు కారు నడిపింది కార్తీక్ కాదు.. కారులో కార్తీక్ కూడా లేడు.. అయినా ముంబై ట్రాఫిక్ పోలీసులు కార్తీక్ కారుకు ఫైన్ వేసిన చలానాని, ఫైన్ వేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్ గా మారింది. 

అసలు కార్తీక్ ఆర్యన్ కుసబంధం లేని తప్పులో ఆయన్ను చూపిస్తూ.. ఆయన నటించిన నటించిన రీసెంట్ మూవీ.. షెహజాదాలోని డైలాగ్ ని మెన్షన్ చేస్తూ.. ముంబయ్ పోలీసులు ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..? మహాశివరాత్రి సందర్భంగా నిన్న(18 పిబ్రవరి) కార్తీక్ ఆర్యన్ డ్రైవర్.. ముంబైలోని ఫేమస్.. సిద్ధి వినాయక టెంపుల్ బయట కారును పార్క్ చేశాడు. అయితే రాంగ్ పార్కింగ్ చేయడంతో ఈ కారుపైన పోలీసులు ఫైన్ వేశారు. అంతటితో ఊరుకోకుండా.. కారుని రాంగ్ సైడ్ పార్కింగ్ చేసిన ఫోటోతో పాటు చలానా విధించిన వీడియోని కూడా పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Scroll to load tweet…

ఈ ట్వీట్ లో కారు రాంగ్ సైడ్ లో పార్క్ చేసి ఉంది. అంతమాత్రాన షెహజాదా ట్రాఫిక్ రూల్స్ ని మీరుతాడని భావించవద్దు అని డైలాగ్ కూడా రాసుకొచ్చారు ముంబయ్ పోలీస్ లు. దాంతో ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ విషయంలో కార్తీక్ ఆర్యన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు కారుకు సబంధించిన విషయం కార్తీక్ కుతెలియకుండానే మీరు ఇలా ఎలా చేస్తారంటూ ఫైర్ అవుతున్నారు. నిజా నిజాలు తెలుసుకుంటే మంచిందంటూ హితబోధ చేస్తున్నారు. 

ఇక రీసెంట్ గా కార్తీక్ నటించిన షెహజాదా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా అల వైకుంఠపురంలో మూవీకి రీమేక్ ఇది. ఈ సినిమా కార్తీక్ ఆర్యన్ కు పెద్దగా వర్కౌట్ అవ్వనట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ యంగ్ హీరో.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.