బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. కార్తీక్ ఆర్యన్ యువతలో ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. కార్తీక్ ఆర్యన్ యువతలో ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కార్తీక్ ఆర్యన్ కూడా యువతని ఆకట్టుకునే చిత్రాలపైనే దృష్టి పెట్టాడు. కార్తీక్ ఆర్యన్ చివరగా నటించిన షెహజాద చిత్రం బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టింది. 

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని కార్తీక్ ఆర్యన్ హిందీలో రీమేక్ చేశారు. కానీ ఇక్కడ జరిగిన మ్యాజిక్ బాలీవుడ్ లో రిపీట్ కాలేదు. బాలీవుడ్ ఆడియన్స్ షెహజాద చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. దీనితో ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. 

ఇదిలా ఉండగా కార్తీక్ ఆర్యన్ తాజాగా విలాసవంతమైన ఫ్లాట్ కొన్నట్లు తెలుస్తోంది. చాలా మంది బాలీవుడ్ తారలు తమ సంపాదనని విలావంతమైన ఇల్లు, అపార్ట్మెంట్స్ కొనేందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే బాటలో ఈ యంగ్ హీరో కూడా పయనిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ముంబైలోని బాంద్రాలో క్రేజీ హీరోయిన్ జాక్వెలిన్ 20 కోట్లతో లగ్జరీ హౌస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ తన అభిరుచికి తగ్గట్లుగా జుహు ప్రాంతంలో అత్యంత ఖరీదైన ఫ్లాట్ కొన్నాడట. 

ఏకంగా 17.5 కోట్లు వెచ్చించి ఈ ఇంటిని సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ కార్తీక్ ఆర్యన్ కి వెర్సోవా ప్రాంతంలో దాదాపు రూ 2 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఉంది. తన ఫ్యామిలీతో కార్తీక్ ఆర్యన్ అక్కడే ఉంటున్నాడు. 

కెరీర్ ఆరంభంలో ఆ ఇంటిని కొన్నాడట. ఇప్పుడు బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ క్రేజీ స్టార్ గా ఎదిగాడు. ఏడాదికి అతడి సంపాదన దాదాపు రూ 50 కోట్ల వరకు ఉంటోంది. దీనితో తాను కలలు కన్నట్లుగా లగ్జరీ హౌస్ ని ఓన్ చేసుకున్నాడు. కెరీర్ జోరుగా సాగుతోంది కాబట్టి ఇంత అధిక మొత్తం వెచ్చించడానికి కార్తీక్ ఆర్యన్ వెనుకాడలేదు.