Asianet News TeluguAsianet News Telugu

హిందీలో రూ.30 కోట్ల మార్క్ రీచ్ అయిన ‘కార్తీకేయ 2’ .. ఆ భారీ చిత్రాన్ని ఎదుర్కొంటుందా?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘కార్తికేయ 2’ క్రేజ్ హిందీలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే తెలుగులో రూ.వంద కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. హిందీలోనూ 30 కోట్ల మార్క్ ను చేరుకుంది. 
 

Karthikeya 2 Movie Reached Rs.30 crore mark in Hindi, Will it face that huge film?
Author
First Published Sep 6, 2022, 10:10 AM IST

చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘కార్తీకేయ 2’ (Karthikeya 2). భిన్న కథలతో ఆడియెన్స్ ను అలరిస్తున్న నిఖిల్ ‘కార్తికేయ 2’తో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తక్కువ స్క్రీన్లతో మొదలై అటు థియేటర్ల సంఖ్య, ఇటు బాక్సాఫీస్ వద్ద వసూళ్లను క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చింది. ఇప్పటికీ ఫోర్త్ వీక్ రన్ అవుతున్నా మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కూడా 1000 లోకేషన్లలో 2500 షోస్ ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా హిందీలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే  రెస్పాన్స్ వస్తోంది. బలమైన కథ, అదిరిపోయే విజువల్స్, స్క్రీన్ ప్లే అదిరిపోవడంతో రిపీటెడ్ ఆడియెన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ కాసుల వర్షం కురిపిస్తోంది. మీడియం బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం రీసెంట్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ.111 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. తాజాగా సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపిన సమాచారం ప్రకారం.. హిందీలో ‘కార్తికేయ 2’ కౌంటింగ్ అద్భుతంగా ఉందని తెలిపారు. బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘బ్రహ్మస్త’కు ముందే రూ.30 కోట్ల మార్క్ ను దాటిందన్నారు. ఫోర్త్ వీక్ లో శుక్రవారం - 51 లక్షలు, శనివారం 86 లక్షలు, ఆదివారం 90 లక్షలు వసూల్ చేసిందని తెలిపారు. అయితే ‘బ్రహ్మస్త్ర’ తర్వాత ఈ చిత్రం పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి. ఒకే అప్పుడూ తట్టుకోగలిగితే మరింత వసూల్ చేసే అవకాశం ఉంది.

అటు యూఎస్ఏ లోనూ ఈ చిత్రం క్రేజ్ జోరుగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ ‘కార్తికేయ 2’ 1.5 మిలియన్ల డాలర్స్ ను వసూల్ చేసిందీ చిత్రం. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. మూవీలో హీరోహీరోయిన్లుగా  నిఖిల్ సిద్ధార్థ (Nikil Siddhartha) - అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించారు. శ్రీనివాస్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios