సినిమా ప్రపంచంలో ఒకే ఒక్క సినిమా చాలు జీవితాన్ని మార్చడానికి. ఎంత సక్సెస్ లో ఉన్నా కొన్నిసార్లు ప్లాప్ లు నేలకేసి కొట్టేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కథలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రస్తుతం యువ హీరో నిఖిల్ అదే స్టేజ్ లో ఉన్నాడు. స్వామి రారా సినిమా నుంచి వరుస విజయాలు అందుకుంటు తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. 

అయితే కిర్రాక్ పార్టీ అనంతరం నిఖిల్ క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. విడుదలకు సిద్దమైన అర్జున్ సురవరం కూడా అటకెక్కింది. రెండు సినిమాల వల్ల డిస్టర్బ్ కావడంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో కార్తికేయ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ రెండు సినిమాల ఎఫెక్ట్ వల్ల కథలో ఇప్పటికే చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 

కథలో ట్విస్ట్ లు అలాగే థ్రిల్లింగ్ గా అనిపించే సీన్స్ ని ఎవరు ఊహించని విధంగా ఉండాలని హీరో దర్శకుడితో ఇన్ని రోజులు సమయాన్ని లెక్క చేయకుండా చర్చించాడు.  వీలైనంత త్వరగా అక్టోబర్ లోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ దర్శకుడు చందు మొండేటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక హీరోయిన్ గా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' లో నటించిన శృతి శర్మను సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్.