Asianet News TeluguAsianet News Telugu

#Karthikeya2: నిఖిల్ ‘కార్తికేయ 2’ ఏ OTT , ఎప్పుడు రిలీజ్

 నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్రం ఆగస్ట్‌ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 15.44 కోట్ల షేర్(26.50 కోట్ల గ్రాస్) కలెక్ట్  చేసి ఔరా అనిపించింది.

Karthikeya 2 Locks OTT Streaming Partner
Author
Hyderabad, First Published Aug 16, 2022, 7:06 PM IST

 టాలీవుడ్‌కి మంచి టైమ్‌ మళ్లీ మొదలైంది. కేవలం పది రోజుల గ్యాప్‌లోనే మూడు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి. ఇండస్ట్రీ సమస్యల గురించి నిర్మాతలు చర్చించుకునే సమయంలో రిలీజైన మూడు సినిమాలు హిట్ అవ్వడంతో ఆనందపడాల్సిన విషయం. ముఖ్యంగా ఈ వారం రిలీజైన కార్తికేయ 2 చిత్రం హిందీ మార్కెట్ లోనూ దుమ్ము రేపుతోంది.  ఈ నేపధ్యంలో   ‘కార్తికేయ 2’  ఇప్పుడు ఏ  ఓటిటిలో ఎప్పుడు  రిలీజ్ కానుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటిటి రైట్స్ ని ZEE5 వారు సొంతం చేసుకున్నారు. ZEE5 తో ఈ చిత్రం నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు మంచి రిలేషన్ ఉంది. ఆయన గత చిత్రం కాశ్మీర్ ఫైల్స్ సైతం ZEE5లోనే ప్రీమియర్ అయ్యింది. ఇప్పుడు కార్తికేయ 2 కూడా ఇదే ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.  

ఇక ఓటిటి రిలీజ్ డేట్ విషయానికి వస్తే...సాధారణంగా ZEE5 సంస్ద ..సాధారణంగా మొదట అనుకున్న తేదికే ప్రతీ సారి ఓటిటి రిలీజ్ ఫిక్స్ అయ్యిపోతూంటుంది. దాంతో చాలా సార్లు ZEE5 లో సినిమాలు ముందే రిలీజ్ అవుతూంటాయి. ఆ లెక్క ప్రకారం కార్తికేయ 2 చిత్రం నాలుగు వారాల్లో ఓటిటిలో వచ్చేయాలి. కానీ ఈ సినిమా పెద్ద హిట్ కావటంతో యాభై రోజులు దాటాకా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. 
  
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ల పై టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా నిర్మించారు. హీరో ఓ పనిపై ద్వారకా నగరం వెళ్లటం అక్కడ చోటు చేసుకునే ఊహించని పరిణామాలు, అక్కడ జరిగే ప్రమాదాలు వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. కార్తికేయ చిత్రంలోలానే ఈ మూవీలో కూడా ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి అని టీజర్, ట్రైలర్ వంటివి స్పష్టంచేశాయి. దీంతో సినిమా పై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. అందువల్ల ఈ సినిమాకు ఓపినింగ్స్ బాగున్నాయి. బిజినెస్ కూడా బాగా జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios