Asianet News TeluguAsianet News Telugu

‘గేమ్ చేంజర్’కథ వెనక షాకింగ్ డిటేల్స్

తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒక పొలిటికల్ కథ రాశానని.. అది ఒక షేప్ తీసుకున్నాక తన అసిస్టెంట్లకు చెబితే.. 

Karthik Subbaraj discloses shocking details about writing for Shankar-Ram Charan Game Changer jsp
Author
First Published Nov 9, 2023, 7:33 AM IST


 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం  గేమ్ ఛేంజర్. భారతీయ భాక్సాఫీస్ కు ముద్దుబిడ్డగా ఎదిగి, ఫిల్మ్ మేకర్స్  గర్వించదగిన డైరెక్టర్లలో ఒకడైన శంకర్ శణ్ముగం డైరెక్ట్ చేస్తున్న సినిమా  కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్  సినిమాలు అందించిన శంకర్.. ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా తీస్తుండటంతో   ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. రకరకాల కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతున్నా.. అప్పుడప్పుడూ ఈ మూవీ టీమ్ నుంచి వస్తున్న అప్‌డేట్స్ అభిమానులకు ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం కథ అందించింది కార్తీక్ సుబ్బరాజు కావటం విశేషం. 

తన తాజా  చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ప్రమోషన్లలో భాగంగా వరసపెట్టి ఇంటర్వూలు ఇస్తున్నారు కార్తీక్. ఆయన  ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ చేంజర్’ విశేషాలు షేర్ చేసాడు. కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ... తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒక పొలిటికల్ కథ రాశానని.. అది ఒక షేప్ తీసుకున్నాక తన అసిస్టెంట్లకు చెబితే.. ఇది శంకర్ సినిమా లాగా పెద్ద స్థాయిలో కనిపిస్తోందిన అభిప్రాయపడ్డారని కార్తీక్ తెలిపాడు. తన కెరీర్లో ఇంకా అంత పెద్ద స్థాయి పొలిటికల్ మూవీ తీసే రేంజికి రాలేదని.. అందుకే ఈ కథను శంకర్‌కు ఇవ్వాలనిపించిందని.. ఆయన్ని సంప్రదించానని కార్తీక్ తెలిపాడు. ఒక పెద్ద హీరోతో శంకరే ఈ సినిమా తీస్తే బాగుంటుందని అనిపించిందని.. ఆయన రామ్ చరణ్‌కు హీరోగా ఎంచుకున్నారని కార్తీక్ తెలిపాడు. కేవలం కథ మాత్రమే తను ఇచ్చానని.. దానికి స్క్రీన్ ప్లే అంతా శంకరే చేసుకున్నాడని.. తన కథ తెరపైకి ఎలా వస్తుందో చూడాలని తనకు కూడా చాలా క్యూరియాసిటీ ఉందని కార్తీక్ తెలిపాడు. 

అలాగే శంకర్‌ సార్‌ దర్శకత్వం తాను దర్శకత్వం వహించగల స్క్రిప్ట్‌లు ఏమైనా ఉన్నాయా అని నన్ను అడిగినప్పుడు రచయితగా, దర్శకుడిగా నేను చాలా గౌరవంగా ఫీలయ్యా. గేమ్ ఛేంజర్ కథను ఆయనకు చెబితే.. చాలా లైక్‌ చేశాడు. గేమ్‌ ఛేంజర్‌ ప్లాట్‌కు భారీ స్థాయి డిమాండ్ ఉంది. శంకర్ సర్ లాంటి వారు మాత్రమే ఆ ప్లాట్‌కు న్యాయం చేయగలరు. గేమ్ ఛేంజర్ శంకర్ సర్ స్టైల్‌లో సాగే పర్‌ఫెక్ట్‌ సినిమా అవుతుంది. ఇది శంకర్‌ జోన్‌లో ఉంటుంది.. అని చెప్పుకొచ్చాడు కార్తీక్‌ సుబ్బరాజు.

కమర్షియల్ సినిమాలు చేయడంలో శంకర్ స్పెషలిస్టు అనే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాగే సామాజిక సందేశానికి వినోదాన్ని జోడించి సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది.  మరి గేమ్‌ ఛేంజర్ లో అలాంటి అంశాలు ఏమి ఉన్నాయో చూడాల్సిందే.  గేమ్‌ ఛేంజర్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాజోలు భామ అంజలి మరో కీలక పాత్ర పోషిస్తోంది. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios