టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ హీరో కార్తీ నెక్స్ట్ మరో మంచి కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దేవ్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు.

రజత్ రవి శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్రేమికుల రోజున అనగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. ఇక సినిమా ఆడియో లాంచ్ ను ఈ నెల 14న గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హరీష్ జై రాజ్ సినిమాకు సంగీతం అందించారు. 

ఇక కార్తీ సరసన రెండవసారి రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదివరకే ఖాకి సినిమాలో వీరిద్దరు నటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయాలనీ కార్తీ ఒకేసారి టాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మరి దేవ్ తో కార్తీ ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.