Asianet News TeluguAsianet News Telugu

నాకు పెళ్లయింది, నేను పనికిరాను,విశాల్ లాంటి బ్యాచిలర్ అయితే బాగా పనికివస్తాడు

నాకు పెళ్లయింది, నేను పనికిరాను
karthi on politics

 

సినీనటులు రాజకీయాల్లోకి రావడం నేటికాలంలో సర్వ సాధారణమైంది. ఒకప్పుడు ఎన్టీఆర్ మొదలు నేడు రజినీకాంత్ కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ వంటి నటులు సొంతంగా పార్టీ లు స్థాపించి రాజకీయాల్లోకి వచ్చినవారే. అయితే కమల్, పవన్ ఇప్పటికే రాజకీయాల్లో వున్నారు. రజిని మాత్రం త్వరలో తన పార్టీ ప్రకటన చేయనున్నారు. అలానే మీడియా వారు కూడా ప్రస్తుతం ఏ హీరో కనిపించినా వాళ్లను రాజకీయాల గురించి ప్రశ్నించడం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మిగతా హీరోలకు కూడా ఈ ప్రశ్నలు తప్పడం లేదు.

ఇందులో భాగంగా తను కూడా రాజకీయాల్లోకి వస్తానని హీరో విశాల్ ఇప్పటికే ప్రకటించగా, తాజాగా దీనిపై మరో హీరో కార్తి తన నిర్ణయం తెలుపుతూ, రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. మైండ్ మొత్తం దానిపైనే పెట్టాలి. సినిమాలన్నీ వదిలేయాలి. రోజులో కనీసం 22 గంటలు దానికే కేటాయించాలి. బ్యాచిలర్స్ కు రాజకీయాలు కరెక్ట్. విశాల్ లాంటి బ్యాచిలర్ అయితే బాగా పనికివస్తాడు. నాకు పెళ్లయింది, నేను పనికిరాను అంటూ సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఎంతోకొంత మంచి చేయాలనుకున్నప్పుడు రాజకీయాల్లోకే రావాల్సిన అవసరం లేదు, మేము ప్రస్తుతం పబ్లిక్ లో ఉన్నాం.

మాకు ఈ జీవితం ఇచ్చింది పబ్లిక్. అలాంటి వాళ్ల కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. సంపాదించినది కొంతయినా తిరిగి వాళ్లకు చేరాలి. నేను ఎన్నో సహాయకార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. రాజకీయాల్లోకి వస్తేనే చేయగలం అనుకుంటే పొరపాటు. కాకపోతే పాలిటిక్స్ లోకి వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు అని ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు….

Follow Us:
Download App:
  • android
  • ios