తమిళ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల 'దేవ్' సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన ఈ హీరో ప్రస్తుతం 'ఖైది' అనే సినిమాలో నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ చూసిన వారంతా కార్తిని చూసి షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు కనిపించని డిఫరెంట్ రోల్ లో కార్తి కనిపించాడు. టీజర్ ని బట్టి కార్తి కరుడుగట్టిన హంతకుడని తెలుస్తోంది. ఓసారి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తుండగా.. చేతికి ఉన్న సంకెళ్లతోనే తప్పించుకొని ఓ లారీతో సహా పారిపోతాడు.

దీంతో పోలీసులు అతడి కోసం వెతుకుంటారు. మరోవైపు ఓ రౌడీ బ్యాచ్ కూడా కార్తి కోసం వెతుకుతుంటారు. అతడిని చంపితే జీవితాంతం సరిపడా డబ్బులిస్తామని చెబుతారు. దీంతో ఓ వైపు పోలీసులు, మరోవైపు రౌడీలు వెతుకుతుండగా.. చివరకు ఏమైందనేదే సినిమా. కథ మొత్తం ఒక్క రాత్రిలో జరుగుతుందట.

కార్తి క్రిమినల్ గెటప్ లో భయపెట్టేలా ఉన్నాడు. దానికి తగ్గట్లుగా నేపధ్య సంగీతం మరింత ఫెరోషియస్ గా ఉంది. లోకేష్ కనగరాజ్డైరెక్ట్ చేసినని డ్రీం వారియర్ పిక్చర్స్, వివేక్ ఆనంద పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. మరి ఈ టీజర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి!