Asianet News TeluguAsianet News Telugu

‘జపాన్‌’ టీజర్ లో మనకు క్లూ ఇచ్చింది ఇదే


ఇండియా అంతటా జపాన్ పై 182 కేసులు వున్నాయి. నాలుగు రాష్ట్రాల పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. కానీ ఒక్కసారి కూడా వాడు ఎవ్వరికీ దొరకలేదు.

Karthi Japan teaser intresting heist thriller! jsp
Author
First Published Oct 19, 2023, 6:14 AM IST


మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంతో మంచి సక్సెస్ ని  సొంతం చేసుకున్న హీరో కార్తి (Karthi). ఇప్పుడు రాజు మురుగన్‌ దర్శకత్వంలో ‘జపాన్‌’ (Japan) సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర  టీజర్ ర్‌ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 
హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల విలువల చేసే నగలు ఎత్తుకుపొతే మీ లా అండ్ ఓర్ద్ ఏం చేస్తుంది ?  

ఈ దొంగతనం స్టయిల్ చూస్తే జపాన్ ది లానే అనిపిస్తుంది

ఇండియా అంతటా జపాన్ పై 182 కేసులు వున్నాయి.

నాలుగు రాష్ట్రాల పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. కానీ ఒక్కసారి కూడా వాడు ఎవ్వరికీ దొరకలేదు.

జపాన్ రేంజే వేరు. అమ్మాయిలు, గోల్డ్ తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా' ఇలా డిఫరెంట్ పాత్రలు జపాన్ కోసం చెప్పే వాయిస్ ఓవర్ లో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

టీజర్ లో అడ్వెంచరస్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కార్తి డిఫరెంట్ గెటప్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ఎక్స్ ట్రార్డినరీ లుక్స్, పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని కట్టిపడేశారు కార్తి. చివర్లో ఎన్ని బాంబులు వేసిన ఈ జపాన్ ఎవరూ ఏం పీకలేర్రా అని కార్తీ చెప్పిన డైలాగ్, వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.

అలాగే టీజర్ లో సునీల్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. దర్శకుడు రాజు మురుగన్ ఇంట్రస్టింగ్ గ్రిప్పింగ్ నేరేషన్ తో కథపై క్యురియాసిటీ పెంచారు.  ఈ సినిమా చివరి దశ చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. త్వరలోనే నిర్మాణానంతర పనులను మొదలుపెట్టనున్న ఈ చిత్రం దీపావళికి రానుంది. తమిళనాడులోని అనేక బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో కార్తి బంగారం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. కామెడీ జోడించి, కొత్త అవతారంలో కార్తి అలరించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి  జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios