ఖాకి సినిమాతో మంచి విజయం అందుకొని చినబాబు సినిమాతో పరవాలేధనిపించిన కార్తీ నెక్స్ట్ మరో యాక్షన్ కథతో రాబోతున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా తెరక్కుతోన్న దేవ్ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు షూటింగ్ కూడా పూర్తికావోస్తోంది. 

ఇకపోతే దేవ్ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది. దేవ్ గా కార్తీ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడని చెప్పవచ్చు. చేతిలో హెల్మెట్ తో ,వెనకాల రేసింగ్ బైక్ తో ఆకర్షిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సినిమాలో మరో కథానాయికగా నిక్కీ గల్రాని నటిస్తోంది. ఖాకి చిత్రంతో బెస్ట్ జోడి అనిపించుకున్న రకుల్ - కార్తీ ఎస్ సినిమాలో కూడా ఆకట్టుకుంటారని చిత్ర యూనిట్ చెబుతోంది. 

ఇకపోతే ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ సినిమాను నిర్మిస్తుండగా తెలుగులో ఠాగూర్ మధు సినిమాను రిలీజ్ చేయనున్నారు. రమ్య కృష్ణ - ప్రకాష్ రాజ్ లు ప్రముఖ పాత్రల్లో కనిపిస్తుండగా హరీష్ జై రాజ్ సంగీతమందించనున్నారు. ఇక దేవ్ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు.