'కాలా'కు లైన్ క్లియర్ అయినట్లే!

Karnataka HC won't interfere in Kaala row, asks state to ensure release
Highlights

రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమాను కన్నడలో విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు 

రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమాను కన్నడలో విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కావేరి జలాల వివాదంలో రజినీకాంత్ తమిళులకు మద్దతుగా నిలవడంతో కన్నడ సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కన్నడిగుడైన రజినీకాంత్ తమిళులకు ఎలా సపోర్ట్ చేస్తారని మండిపడ్డారు. ఆయన నటించిన 'కాలా' సినిమా రిలీజ్ టైమ్ చూసి కన్నడలో రిలీజ్ కాకుండా ఆపే విధంగా ప్లాన్ చేశారు. అయితే కర్ణాటక హైకోర్టు మాత్రం సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సినిమా రిలీజ్ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని వెల్లడించిన హైకోర్టు సినిమా విడుదలైన అన్ని థియేటర్ల వద్ద భద్రత మాత్రం కల్పిస్తామని స్పష్టం చేసింది. దీంతో 'కాలా' సినిమా కర్ణాటకలో ఊరట లభించినట్లే.. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ లో రికార్డ్ సృష్టించిన ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

loader