Asianet News TeluguAsianet News Telugu

ఆ టెర్రర్ కి కొద్దినిమిషాల ముందు...వైరల్ అవుతున్న కరీనా, సైఫ్ ఫోటోలు

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన భర్తకు ఓ అరుదైన బహుమతి ఇచ్చింది. ఇటీవల సైఫ్ అలీ ఖాన్ తన 50వ పుట్టిన రోజు జరుపుకోగా ఆయనపై ఓ అరుదైన వీడియో చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 

kareena shares a special video on saifs birthday eve
Author
Hyderabad, First Published Aug 21, 2020, 8:56 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల సైఫ్ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సంధర్భంగా ఆయన సతీమణి కరీనా కపూర్ ఖాన్ ఓ అరుదైన వీడియో పంచుకున్నారు. తన భర్త సైఫ్ అలీ ఖాన్ పుట్టిన నాటి నుండి ఆయన జీవితంలో జరిగిన అరుదైన సందర్భాలకు సంబంధించిన ఫోటోలతో కూడుకున్న ఓ వీడియో ఆమె సోషల్ మీడియాలో విడుదల చేయగా...ఆసక్తి రేపుతోంది. 50 అరుదైన ఫోటోలు ఆ వీడియోలో ఉండగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ముఖ్యంగా కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీ మరియు తైమూరు అలీఖాన్ పుట్టిన సందర్భాలకు సంబధించిన ఫోటోలకు అద్భుతమైన కోట్స్ ఇవ్వడం జరిగింది. తైమూరు పుట్టడానికి కొన్ని నిమిషాల ముందు సైఫ్ భార్య కరీనాతో కలిసి ఓ ఫోటోకి పోజిచ్చారు. ఆ ఫొటోకు కరీనా '' టెర్రర్ కి కొద్దినిముషాల ముందు'' అని క్యాప్షన్ ఇచ్చారు. తనకు పుట్టబోతున్న మొదటి సంతానాన్ని ఆసక్తికరంగా టెర్రర్ అంటూ పోల్చింది కరీనా కపూర్. 2016 డిసెంబర్ 20న వీరికి తైమూరు అలీ ఖాన్ జన్మించారు. 

కెరీర్ ఫీక్స్ లో ఉన్నప్పుడే కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది. మొదటి భార్య అమృతా సింగ్ కి 2004లో విడాకులు ఇచ్చిన సైఫ్, రెండవ వివాహంగా కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యకు ఇద్దరు సంతానం కాగా వారిలో సైఫ్ అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కరీనా కపూర్, సైఫ్ లకు తైమూర్ అలీ ఖాన్ పుట్టారు. కరీనా కపూర్ అండ్ సైఫ్ బాలీవుడ్ లో హ్యాపీ కపుల్ గా కొనసాగుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios