బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తన భర్త సైఫ్ అలీ ఖాన్.. సన్నీలియోన్ భర్తని చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటే బాగుంటుందని అంటోంది. ఇంతకీ కరీనా ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందంటే.. సన్నీలియోన్ దంపతులకు సరోగసి పద్దతిలో పిల్లలు ఉన్నారు.

అలానే వారు ఓ పాపని దత్తత తీసుకున్నారు. ఆ పిల్లల ఆలనాపాలన విషయంలో సన్నీ భర్త చాలా బాధ్యతగా ఉంటారట. పిల్లలకు డైపర్స్ మార్చడం దగ్గర నుండి వారికి స్నానం చేయించడం, ఫుడ్ తినిపించడం ఇలా చాలా పనులు చేస్తారట.

ఈ విషయాలన్నీ కరీనా కపూర్ నిర్వహించిన ఒక టాక్ షోలో వెల్లడించింది సన్నీలియోన్. తన భర్త పిల్లల విషయంలో అంత బాధత్యగా ఉంటాడని చెప్పగా.. కరీనా కపూర్ అతడిని చూసి సైఫ్ అలీఖాన్ చాలా విషయాలు నేర్చుకోవాలని అంది.

కరీనా-సైఫ్ లకు తైమూర్ సంతానం. తైమూర్ విషయంలో సైఫ్ అసలు ఎలాంటి పనులు చేయడని చెప్పుకొని వాపోయింది. సాధారణంగా భార్యలకు తమ భర్తల విషయాల్లో ఇలాంటి ఫిర్యాదులు కామన్. కరీనా మాటలకు అక్కడున్న వారంతా నవ్వేసి ఊరుకున్నారు.