Asianet News Telugu

రెండో కుమారుడు ఫోటో రివీల్ చేసిన కరీనా కపూర్

మొదటిసారి జెహ్ ఫోటో రివీల్ చేశారు కరీనా కపూర్. బెడ్ పై పడుకొని ఉన్న జెహ్ ని కరీనా కపూర్ అపురూపంగా ముద్దాడుతున్నారు. బొద్దుగా, ముద్దుగా ఉన్న జెహ్ ఫోటో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

kareena kapoor reveals her second child look at adorable photo ksr
Author
Hyderabad, First Published Jul 16, 2021, 10:34 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సెలబ్రిటీలకు పుట్టిన పిల్లలు కూడా సెలెబ్రిటీలే. అందుకే ఆ పిల్లలు ఎలా ఉండారో, ఎంత అందంగా ఉన్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆతృతగా ఉంటారు. కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 21వ తేదీన ఆమె మగ బిడ్డను కన్నారు. జెహ్ అంటూ నామకరణం చేయడం జరిగింది. జెహ్ పుట్టిన నాటినుండి అతని ఫోటో రివీల్ చేయలేదు. 


మొదటిసారి జెహ్ ఫోటో రివీల్ చేశారు కరీనా కపూర్. బెడ్ పై పడుకొని ఉన్న జెహ్ ని కరీనా కపూర్ అపురూపంగా ముద్దాడుతున్నారు. బొద్దుగా, ముద్దుగా ఉన్న జెహ్ ఫోటో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 2012లో కరీనా కపూర్ ని నటుడు సైఫ్ అలీ ఖాన్ రెండవ వివాహం చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా 2015లో తైమూర్ అలీ ఖాన్ జన్మించాడు. 


ప్రస్తుతం కరీనా కపూర్ అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుండగా కరీనా కూడా పాల్గొంటున్నారు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్ గా లాల్ సింగ్ చద్దా తెరకెక్కుతుంది. ఈ మూవీలో నాగ చైత్యన్య కూడా ఓ రోల్ చేయడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios