Asianet News TeluguAsianet News Telugu

ఆ పదం వాడినందుకు.. క‌రీనా క‌పూర్‌కు కోర్టు నోటీసులు

 బైబిల్ ప‌దం వాడ‌డం క్రైస్త‌వ స‌మాజ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్లు అవుతుంద‌ని జ‌బ‌ల్‌పుర్‌కు చెందిన సామాజిక కార్య‌క‌ర్త ఆంథోనీ త‌న పిటీష‌న్‌లో ఆరోపించారు. 

Kareena Kapoor Receives Court Notice For Using 'Bible' In 2021 Pregnancy Book Title jsp
Author
First Published May 12, 2024, 11:35 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ కు ఇద్దరు పిల్లలు. నటిగా నెంబర్ వన్ గా  ఉన్న సమయంలో గర్భధారణ, ప్రసవం వంటివి ఆమె జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఆమె  మీద చాలా ఒత్తిడి చూపించాయి. దాంతో తనకే కాదు...ఏ  ఇతర ఏ రంగంలో ఉన్న స్త్రీలకు కూడా  ఇలాగే కలగవచ్చని ఆమెకు అనిపించింది. దాంతో ప్రెగ్నిన్సీ నుంచి ప్రసవం వరకూ వుండే సవాలక్ష సందేహాలకు తాను పొందిన జవాబులు అందరికీ చెప్పాలని ఆమెకు అనిపించింది. ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’టైటిల్ పెట్టి ఓ  పుస్తకం రాసి ఆమె విడుదల చేసింది. కాబోయే తల్లులకు ఇది కచ్చితంగా ఉపయుక్తమమని భావించింది. అయితే ఇప్పుడా పుస్తకం నిమిత్తం ఆమె లీగల్ నోటీసు అందుకుంది.
 
వివరాల్లోకి వెళితే... ‘క‌రీనా క‌పూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ బుక్ టైటిల్‌లో బైబిల్ అన్న ప‌దాన్ని వాడ‌డాన్ని త‌ప్పుప‌డుతూ ఓ అడ్వకేట్ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసులో జ‌స్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం తీర్పును వెలువ‌రించింది. క‌రీనా క‌పూర్‌పై కేసు న‌మోదు చేయాల‌ని అడ్వ‌కేట్ క్రిస్టోఫ‌ర్ ఆంథోనీ పిటీష‌న్ వేశారు. పుస్తకం టైటిల్‌లో బైబిల్ అన్న ప‌దాన్ని ఎందుకు వాడార‌ని కోర్టు ప్ర‌శ్న‌లు వేసింది. పుస్త‌కంపై బ్యాన్ విధించాల‌ని అడ్వ‌కేట్ ఆంధోనీ డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆ పుస్త‌కం అమ్మ‌కందారుల‌కు కూడా నోటీసులు జారీ చేశారు.

బుక్ టైటిల్‌లో బైబిల్ ప‌దం వాడ‌డం క్రైస్త‌వ స‌మాజ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్లు అవుతుంద‌ని జ‌బ‌ల్‌పుర్‌కు చెందిన సామాజిక కార్య‌క‌ర్త ఆంథోనీ త‌న పిటీష‌న్‌లో ఆరోపించారు. క్రైస్త‌వుల‌కు బైబిల్ చాలా ప‌విత్ర గ్రంథం అని, క‌రీనా కపూర్ త‌న ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చ‌డం స‌రికాదు అని ఆ పిటీష‌న్‌లో పేర్కొన్నారు. త‌న పుస్త‌కానికి పాపులారిటీ తీసుకువ‌చ్చేందుకు న‌టి క‌రీనా ఆ ప‌దాన్ని వాడిన‌ట్లు ఆంథోనీ ఆరోపించారు. 2021లో ఈ బుక్‌ను ప‌బ్లిష్ చేశారు.

కొన్నిరోజుల క్రితం కరీనా కపూర్‌ ‘ఇది నా మూడోబిడ్డ. ఇన్నాళ్లూ దీని పనిలోనే ఉన్నా’ పుస్తకాన్ని తేవడం కూడా బిడ్డను కనడంతో సమానం అని వ్యాఖ్యానించింది.  రెగ్యులర్ పుస్తకాల కన్నా ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ కొంత భిన్నమైనది. ఒక ప్రసిద్ధ నటి తన సహజమైన సందేహాలకు తెలుసుకున్న సమాధానాలను, పాటించిన జాగ్రత్తలను, అందులో ఎప్పటికప్పుడు ఎదురైన సమస్యలను తన దృష్టికోణం నుంచి చెప్పడమే ఈ పుస్తకం ప్రత్యేకత.
 
 ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అనుభవం అనేక విషయాలను తెలిపే అవకాశం ఉంది. ఆమె ఈ పుస్తకాన్ని తన జ్ఞానంగా కాక గైనకాలజిస్ట్‌ల సాయంతో చేశానని వారి పేర్లు కూడా ప్రస్తావించింది. ఈ పుస్తకాన్ని ఎఫ్‌.ఓ.జి.ఎస్‌.ఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆబ్స్‌టెట్రిక్‌ అండ్‌ గైనకాలజికల్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండియా) కూడా ఆమోదించడంతో ఇందులో ఉన్నది అథెంటిక్‌ సమాచారం అని చెప్పవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios