రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ తో చేసున్న ఆదిపురుష్ మూవీపై నిన్న కీలక అప్డేట్ రావడం జరిగింది. రామాయణ కథగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రధాన విలన్ రావణాసురుడు పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ని తీసుకున్నట్లు ప్రకటించారు. దీనిపై నిన్న అధికారిక ప్రకటనతో కూడిన పోస్టర్ విడుదల చేశారు.దీనితో రాముడైన ప్రభాస్ తో తలపడే రావణాసురుడిగా సైఫ్ నటించనున్నారనేది స్పష్టం అయ్యింది. 

ఇక ఆదిపురుష్ మూవీలో సైఫ్ రావణుడిగా నటించడంపై ఆయన భార్య కరీనా కపూర్ స్పందించారు. ఈ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ లో పంచుకోవడంతో పాటు ఆసక్తికర కామెంట్ చేశారు. ప్రపంచంలోనే అందమైన రాక్షసుణ్ణి పరిచయం చేస్తున్నాం అన్నారు. కరీనా కామెంట్ కి నెటిజెన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఎంత భర్త అయితే మాత్రం రావణాసురుణ్ణి అందగాడు అంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఆదిపురుష్ మూవీ భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ లా తెరకెక్కనుంది. ప్రభాస్ మొదటిసారి ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఆయన రాముడు పాత్ర చేయడం మరింత ఆసక్తిరేపుతుంది. భారీ అంచనాలు ఈ ప్రాజెక్ట్ పై ఏర్పడగా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 లో విడుదల చేయాలనేది దర్శక నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది.