బాలీవుడ్ బెబో కరీనా కపూర్ మరో బిడ్డకు జన్మినిచ్చారు. మరలా ఆమెకు అబ్బాయి పుట్టడం విశేషం. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో కరీనా కపూర్ అడ్మిట్ అయ్యారు. ఆదివారం అనగా ఫిబ్రవరి 21న కరీనా కపూర్ డెలివరీ అయ్యారని సమాచారం. ఇక కరీనా కపూర్ సెకండ్ చైల్డ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నటుడు సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ 2012లో వివాహం చేసుకున్నారు. సైఫ్ కి ఇది రెండో వివాహం కావడం విశేషం. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లకు మొదటి సంతానంగా 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించారు. గత ఏడాది ఆగస్టులో కరీనా తన ప్రెగ్నెన్సీని ధ్రువీకరించారు. 

ప్రస్తుతం కరీనా కపూర్ లాల్ సింగ్ చద్దా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. నటుడు అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ హాలీవుడ్ చిత్రానికి రీమేక్. ప్రెగ్నెన్సీ నేపథ్యంలో షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన కరీనా త్వరలో సెట్స్ లో జాయిన్ కానున్నారు.