నందమూరి తారకరత్న మరణించి నేడు 11వ రోజు కావడంతో కుటుంబ సభ్యులు పెద్ద కర్మ, సంస్కరణ కార్యక్రమం చేశారు. నందమూరి ఫ్యామిలిలో ఇంకా విషాదం తొలిగిపోలేదు. అతి పిన్న వయసులోనే నందమూరి తారకరత్న మరణించడంతో కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది.

నందమూరి తారకరత్న మరణించి నేడు 11వ రోజు కావడంతో కుటుంబ సభ్యులు పెద్ద కర్మ, సంస్కరణ కార్యక్రమం చేశారు. నందమూరి ఫ్యామిలిలో ఇంకా విషాదం తొలిగిపోలేదు. అతి పిన్న వయసులోనే నందమూరి తారకరత్న మరణించడంతో కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు.

బాలకృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని ముందుండి చూసుకునట్లు తెలుస్తోంది. తారక రత్న మరణించినప్పుడు బాలయ్య ఎంతగా వేదన చెందారో అందరికి తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి, బాలకృష్ణ , నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇంకా ఇతర ప్రముఖులు పెద్ద కర్మకు హాజరై తారకరత్నకి నివాళుళు అర్పించారు. 

చిత్ర పరిశ్రమ నుంచి సినీ ప్రముఖులు కూడా హాజరై తారకరత్న చిత్ర పటానికి నివాళులు అర్పించారు. వివాదాస్పద నటి కరాటే కళ్యాణి కూడా తారకరత్న పెద్ద కర్మకి హాజరైంది. అయితే ఆమె తారకరత్న పెద్ద కర్మ గురించి, బాలకృష్ణ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వివాదంగా మారుతోంది. 

కరాటే కళ్యాణి తన పేస్ బుక్ పేజీలో కొన్ని కామెంట్స్ పెట్టింది. తారకరత్న పెద్ద కర్మకి హాజరయ్యాను. ఈ కార్యక్రమాన్ని బాలయ్య బాబు, ఆయన సతీమణి వసుంధర దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్నని మరచిపోవడం చాలా కష్టంగా అనిపించింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించా అని కరాటే కళ్యాణి పోస్ట్ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కూడా ఆమె కొన్ని కామెంట్స్ పెట్టింది. 

పెద్ద కర్మలో బాలయ్య బాబు ఇటు రా అమ్మా అని పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. తొందర్లోనే మోక్షజ్ఞ సినిమా ప్రారంభం అవుతుంది. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటిస్తాడు అని బాలయ్య బాబు చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. తొందర్లోనే నందమూరి వారసుడు వస్తున్నాడు అని అందరూ సంతోష పడ్డారు. కానీ బాధలో అందరిని పలకరించి అక్కడి నుంచి వచ్చేశా అంటూ కరాటే కళ్యాణి నమ్మశక్యం కానీ వ్యాఖ్యలు చేసింది. 

దీనితో కరాటే కళ్యాణిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక వైపు కొడుకుతో సమానమైన తారకరత్న పెద్దకర్మ జరుగుతుంటే.. ఈమెని పిలిచి పక్కనే కూర్చోబెట్టుకున్నాడట. పైగా మోక్షజ్ఞ సినిమా టైటిల్ ని అక్కడ ప్రకటించాడట. అసలు కరాటే కళ్యాణి చేస్తున్న వ్యాఖ్యలు ఏమైనా నమ్మే విధంగా ఉన్నాయి. పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ పోస్ట్ లు పెట్టకు అని ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నేను చాలా సంతోష పడ్డాను అని కరాటే కళ్యాణి చెప్పడం, అక్కడ తారకరత్న చిత్ర పటాన్ని సెల్ఫీలు తీసుకోవడం ఈమెకే చెల్లింది అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.