అర్జున్ రెడ్డి సినిమాతో సౌత్ ని షేక్ చేసిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా బాలీవుడ్ ప్రముఖులు కూడా తనవైపు చూసేలా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఏ ఇండస్ట్రీలో అయినా ఒక సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రాబట్టింది అంటే తప్పకుండా ఇతర సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు ఆ సినిమా గురించి తెలుసుకుంటారు. 

ఇక విజయ్ దేవరకొండ కూడా వరుసగా హిట్స్ అందడంతో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దృష్టిలో పడ్డట్లు తెలుస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ తో ఒక కథను సెట్ చేసుకున్న కరణ్ జోహార్ ప్రభాస్ నో చెప్పడంతో తెరపైకి తేలేకపోయాడు. దీంతో ఇప్పుడు ప్రభాస్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ ను సెట్ చేస్తున్నట్లు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. 

అందులో భాగంగానే ఇటీవల శ్రీదేవి కూతురు ద్వారా అందరూ మాట్లాడుకునేలా కరణ్ తన షోలో ప్లాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రీసెంట్ గా కాపీ విత్ కరణ్ షోలో జాన్వీ విజయ్ తో నటించాలని ఉందని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఈ వార్త పై నార్త్ లో భిన్నాభిప్రాయాలు వెలువడుతుండడం గమనార్హం. ఇక ప్రభాస్ సినిమాను దేవరకొండకు సెట్ చేయడం వంటి వార్తలు కూడా నమ్మకంగా లేవు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఎవరో ఒకరు స్పందించేవరకు మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.