ఇటీవల బిష్ణోయ్ ముఠా బాలీవుడ్ సింగర్, పొలిటీషియన్ సిద్దూ మూసేవాలాని దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ కేంద్రంగా అనేక వివాదాలు, నేరాలు జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ ప్రముఖులు నేరుగా వివాదాల్లో చిక్కుకునే సంఘటనలు కొన్ని అయితే.. వారిని టార్గెట్ చేసుకుని హాట్ టాపిక్ గా మారిన సంఘటనలు మరికొన్ని. ప్రస్తుతం బిష్ణోయ్ ముఠా బాలీవుడ్ ని వణికిస్తోంది. 

ఇటీవల బిష్ణోయ్ ముఠా బాలీవుడ్ సింగర్, పొలిటీషియన్ సిద్దూ మూసేవాలాని దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యలో కీలక వ్యక్తి సిద్దేశ్ కాంబ్లీతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

ఈ ముఠాని నడిపిస్తోంది లారెన్స్ బిష్ణోయ్. అతడి అనుచరుడి సిద్దేశ్. పోలిసుల విచారణలు సిద్దేశ్ సంచలన విషయాలని బయట పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

కరణ్ జోహార్ ని కిడ్నాప్ చేసి రూ 5 కోట్ల వరకు డబ్బు డిమాండ్ చేయాలని ప్లాన్ కూడా వేశారట. అలాగే సిద్దూ హత్యకి ఎవరు ప్లాన్ చేశారు.. ఎలా చంపారు అనే విషయాలని కూడా సిద్దేశ్ పోలిసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ కూడా ఉంది. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలని వేటాడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కృష్ణ జింకలని వేటాడినందుకు గాను సల్మాన్ ఖాన్ ని చంపేస్తాం అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ 2018లో బెదిరింపులకు దిగారు. ఇటీవలే సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ని కూడా బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది.