టాలీవుడ్ సినిమాలను ఇటీవల నార్త్ ప్రేక్షకులు తెగ ఇష్టపడుతున్నారు. బాహుబలి వేసిన బాటలో చాలా వరకు సౌత్ సినిమాలు హిందీలో కూడా క్లిక్ అవుతున్నాయి. ఇకపోతే బాహుబలి సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేసిన కరణ్ జోహార్ టాలీవుడ్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. 

బాహుబలి విజయంలో కరణ్ జోహార్ పాత్ర ఎంతో ఉంది. ఇకపోతే తెలుగులో అడివి శేష్ నటించిన గూఢచారి చిత్రం బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనీ కరణ్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ తెలిపారు. 

తెలుగులో మంచి చిత్రాలు వస్తున్నాయని రీసెంట్ గా తాను చూసిన స్పై థ్రిల్లర్ గూఢచారి ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని త్వరలోనే ఆ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నం చేస్తానని కరణ్ జోహార్ వివరణ ఇచ్చారు. గతంలో అడివి శేష్ నటించిన క్షణం సినిమాను కూడా భాగీ 2 పేరుతో రీమేక్ చేశారు. 

టైగర్ ష్రాఫ్ నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అడివి శేష్ హీరోగానే కాకుండా కథ రచయితగా కూడా క్షణం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే తరహాలో గూఢచారి కథను రాసి మరో విజయాన్ని అందుకున్నాడు.