టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్టర్ బాహుబలి వరల్డ్ వైడ్ గా అంతగా హిట్టవ్వడానికి కారణం సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేయడమే. అంతే కాకుండా నేషనల్ లెవెల్లో సినిమాకు చేసిన ప్రమోషన్స్ బాగా క్లిక్ అయ్యాయి. పెట్టిన ప్రతి రూపాయికి పదింతలు లాభం రావడంతో పాన్ ఇండియన్ సినిమాలు ఒక్కొక్కటిగా పుట్టుకొస్తున్నాయి. 

బాహుబలి విజయంలో కరణ్ జోహార్ పాత్ర చాలానే ఉంది. ఆ మేలును జక్కన్న ఎప్పటికి మరచిపోలేడు. సినిమాను నేషనల్ వైడ్ రిలీజ్ చేసేందుకు ప్రమోషన్స్ లో పెద్దన్న పాత్ర పోషించిన కరణ్ కు ఇప్పుడు జక్కన్న అవసరం పడింది. కరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాను నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయడానికి తమిళ్ - తెలుగు అలాగే మలయాళం భాషల్లో కూడా తెరకెక్కిస్తున్నారు. 

సౌత్ లో రాజమౌళికి మంచి ఫాలోయింగ్ ఉంది. పెద్ద సినిమాలకు జక్కన్న సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో KGF సక్సెస్ తో రుజువయ్యింది. అయితే ఆ సినిమాకు జక్కన్న కేవలం ఈవెంట్ తో సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు బ్రహ్మాస్త్ర సౌత్ బాధ్యతలను మొత్తం కరం జోహార్ జక్కన్నకు నెత్తిపైనే మోపినట్లు తెలుస్తోంది. సినిమా తెలుగులో అలాగే సౌత్ లో మంచి మార్కెట్ ఏర్పడే విధంగా చేయాలనీ చర్చలు జరిపాడని సమాచారం. 

సినిమా తెలుగు టైటిల్ లోగో అయితే సోషల్ మీడియా ద్వారా కానిచ్చినా ముందు ముందు చిత్ర యూనిట్ సౌత్ లో అడుగుపెడితే రాజమౌళి తోడుగా ఉండాల్సిందే అని టాక్ వస్తోంది. నాగార్జున సినిమాలో నటిస్తుండడంతో జక్కన్నకు ఓ తోడు దొరికినట్లే. 

కానీ RRR షూటింగ్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలంటే అంత సులువైన పనేనా అనే సందేహం కలుగుతోంది. బ్రహ్మాస్త్ర సినిమా ఈ ఏడాది చివరలో డిసెంబర్ 25న రానుంది. మరి రాజమౌళి ఎలాంటి ప్లానింగ్ తో కరణ్ సినిమాకు ప్రమోషన్స్ చేస్తాడో చూడాలి.

టాలీవుడ్ స్టార్ హీరోల విద్యార్హతలు