Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ పై కరణ్ జోహార్ ప్రశంసల వర్షం.. అసలైన సూపర్ స్టార్ అంటూ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పాన్ ఇండియా చిత్రం పుష్పతో రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్నాడు. పుష్ప నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

karan johar calls allu arjun as absolute superstar
Author
Hyderabad, First Published Oct 28, 2021, 11:00 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పాన్ ఇండియా చిత్రం పుష్పతో రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్నాడు. పుష్ప నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ బుధవారం 'వరుడు కావలెను' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా కామెంట్ చేశాడు. 

అలాగే Allu Arjun ఓ బాలీవుడ్ చిత్రంపై కూడా కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. త్వరలో నేషనల్ లెవల్ లో Sooryavanshi చిత్రం విడుదుల కాబోతోంది. ఆ చిత్రానికి కూడా నా శుభాకాంక్షలు. ఇలాంటి చిత్రాలు జనాల్ని మళ్ళీ థియేటర్స్ కు తీసుకురావాలి. సౌత్ ఇండియా తరుపున సూర్య వంశీ చిత్రానికి ఆల్ ది బెస్ట్ అని బన్నీ కామెంట్స్ చేశాడు. 

అల్లు అర్జున్ కామెంట్స్ పై సూర్యవంశీ దర్శకుడు రోహిత్ శెట్టి, నిర్మాత Karan Johar స్పందించారు. 'నేను గతంలో కూడా చెప్పాను.. ఇది నా సినిమా కాదు.. మన సినిమా. నీ మద్దతు, ప్రేమకు థాంక్యూ అల్లు అర్జున్. పుష్ప చిత్రానికి కూడా ఆల్ ది బెస్ట్. నువ్వొక రాక్ స్టార్' అంటూ రోహిత్ శెట్టి అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. 

ఇక కరణ్ జోహార్ స్పందిస్తూ.. అల్లు అర్జున్ అసలైన సూపర్ స్టార్.. నీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సూర్యవంశీ చిత్రం నవంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

Also Read: ఇంటర్నెట్ లో తేజస్వి థండర్ స్ట్రామ్.. బోల్డ్ గా రెచ్చిపోయిన బ్యూటీ

బన్నీ నటించిన పుష్ప మూవీ మొదటి భాగం Pushpa the Rise డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.. ప్రస్తుతం చిత్ర యూనిట్ క్రమంగా ప్రచార కార్యక్రమాల జోరు పెంచుతోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios