బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ క్యాస్టింగ్ అండ్ భారీ బ్యాడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాస్త్ర. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. 

బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ క్యాస్టింగ్ అండ్ భారీ బ్యాడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాస్త్ర. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు భాగాలుగా రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా షూటింగ్ గత కొంత కాలంగా శరవేగంగా జరుగుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రన్ బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అసలు విషయంలోకి వస్తే అడ్వెంచర్ ఫాంటసి చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను చిత్ర యూనిట్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలనీ అనుకుంటోంది. 

అసలైతే ఫస్ట్ పార్ట్ ను 2019 సమ్మర్ అనంతరం ఆగస్టులో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ కొన్ని షెడ్యూల్స్ ఆలస్యం అవుతుండడంతో కరణ్ జోహార్ 2019 క్రిస్మస్ కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు అండ్ తమిళ్ లో కూడా సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది.