బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ఒక సినిమాను మొదలుపెట్టాడు అంటే ఆ సినిమా మినిమమ్ గ్యారెంటీ హిట్ అని ముందే చెప్పవచ్చు. కానీ ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగు సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కొని డైలమాలో  పడ్డారు ఈ స్టార్ సెలబ్రెటీ. అసలు ఆ రీమేక్ ఎవరితో చేయాలి అని ఓ కన్ఫ్యూజన్ తో సతమతమవుతున్నాడు. 

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఉహించినంతగా సక్సెస్ కాలేకపోయింది. రిలీజ్ కు ముందే తొందరపడి రైట్స్ కొనుక్కున్న కరణ్ జోహార్ ఇప్పుడు ఆ రీమేక్ కోసం నటీనటులను వెతికే పనిలో పడ్డాడు. కానీ ఎవరు ఆ సినిమాలో నటించడానికి దైర్యం చేయడం లేదట. 

కరణ్ తో దగ్గరగా ఉండే నటీనటులందరూ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో రీసెంట్ గా కొంత మంది దగ్గరకు డియర్ కామ్రేడ్ కథ వెళ్లిందట. కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ అయితే మళ్ళీ వెంటనే రీమేక్ సినిమా చేయలేనని తప్పించుకోగా మరో ఇద్దరు హీరోలు కథ నచ్చలేదని డ్రాప్ అయ్యారట. దీంతో కరణ్ కొన్నాళ్ళు డియర్ కామ్రేడ్ రీమేక్ ఆలోచనని పక్కనపెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ బడా నిర్మాత 6 సినిమాలను నిర్మిస్తూ బిజీ బిజీగా షూటింగ్ పనుల్లో పాల్గొంటున్నాడు.