ఇక ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్. ఈ హడావిడి నుంచి బ్రేక్ కోరకున్నారో ఏమో కాని.. ట్విట్టర్ ను వదిలేస్తున్నట్టు ప్రకటించిన కరణ్ లాస్ట్ పోస్ట్ ఏం పెట్టారంటే..?
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరన్ జోహార్ తాజాగా ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్టు ర్కొన్నారు. కరణ్ జొహార్ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారు. తన అకౌంట్ ను డీయాక్టివేట్ చేశారు. తన చివరి ట్వీట్ లో... మరింత పాజిటివ్ వైబ్స్ కోసం ట్విట్టర్ కు గుడ్ బై చెపుతున్నానని తెలిపారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ కు దూరం కావడం సరికాదని కొందరు అంటుండగా... ట్విట్టర్ లో ఉండి మాత్రం చేసేదేముందని మరి కొందరు మాట్లాడుతున్నారు.
కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మల్టీ టాలెంటెడ్. నటుడిగా స్టార్ట్ అయ్యి.. అసిస్టెంట్ డైరెక్టర్గా మారారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కరణ్ జోహార్ తర్వాత కుచ్ కుచ్ హోతా హై అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన రీసెంట్ గా పూర్తి స్థాయిలో నిర్మాతగా అవతారం ఎత్తారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అంటే కరణ్ జోహార్ పేరు మాత్రమే వినిపిస్తుంటుంది. స్టార్ కిడ్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే కరణ్ ను లక్కీగా ఫీల్అవుతుంటారు. ఆ మధ్య శ్రీదేవి కూతురు జాన్వీని కూడా స్క్రీన్ కు పరిచయం చేసింది కరణ్ జోహారే. ఇదే ఆయన్ను విమర్షలకు బలి చేసింది. నెపొటిజాన్ని ఆయన ఎంక్రైజ్ చేస్తున్నారంటూ అపాదు పడింది. దానికి తోడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఎక్కువగా కరణ్ జోహార్ ను టార్గెట్ చేశారు సుశాంత్ రాజపుత్ అభిమానులు. ఒకరకంగా బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నా దాన్ని బాయికాట్ చేయాలనే ట్రెండ్ ఎక్కువగా వినిపిస్తోంది.
ఈ మధ్య ఆయన టాలీవుడ్ మూవీ లైగర్ ను పాన్ ఇండియాలో రిలీజ్ చేశారు. విదేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన లైగర్ సినిమాకి కూడా కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు. భారీ స్థాయిలో ఈమూవీ రిలీజ్ కావడానికి కరణ్ జోహార్ కారణం అయ్యారు. ఇక ఈసినిమాకు కూడా బాయ్ కాట్ ట్రెండ్ తప్పలేదు. లైగర్ డిజాస్టర్ అయినా.. టాలీవుడ్ నుంచి మరికొన్ని సినిమాలు లైన్ చేసుకుంటూన్నారు కరణ్. తెలుగు హీరోల క్రేజ్ ను బాలీవుడ్ లో ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యాడు కరణ్.
