బాహుబలి భారీ విజయం వెనుక కరణ్ జోహార్ కరణ్ మూలంగా దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాహుబలి తాజాగా సాహో సినిమాకు మాత్రం మొఖం చాటేస్తున్న కరణ్

‘బాహుబలి’ చిత్రం ఘన విజయం వెనుక బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వున్నారనేది జగమెరిగిన సత్యం. కరణ్ జోహార్ మూలాంగా బాహుబలి కోసం అక్కడి ప్రమోషన్స్ ఒక రేంజిలో పనిచేసాయి. కరణ్ జోహార్ సహాయం లేకుండా ‘బాహుబలి’ ఈ రేంజ్ హిట్ అందుకోలేకపోయేది. అయితే ‘బాహుబలి’ సంచలన విజయం వెనుక తన శక్తి వంచన లేకుండా కృషిచేసిన కరణ్ ఆ మూవీ తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా విషయంలో పెద్దగా ఆసక్తికనపరచడం లేదని తెలుస్తోంది.

సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘సాహో’ బాలీవుడ్ లో కూడ విడుదల చేసి అక్కడ కూడ ఘన విజయం సాధించాలని ‘సాహో’ నిర్మాతలు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈమూవీ ప్రమోషన్ తో పాటు బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాన్ని కూడ కరణ్ జోహార్ కు అప్పచెప్పాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగ ముందుకు సాగడంలేదు అని ఫిలింనగర్ టాక్. 

ఇది ఇలా ఉండగా ఈమూవీలో ప్రభాస్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయినే వుండాలని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు ఈసినిమా నిర్మాతలు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ ఇందులో హీరోయిన్‌ గా నటించినందుకు కాను దాదాపు ఎనిమిది కోట్ల భారీ పారితోషికం కూడ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ నిర్ణయం పట్ల ప్రభాస్ అభిమానులు ఆనందంగా లేరు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం శ్రద్ధ బాలీవుడ్ లో బి గ్రేడ్‌ హీరోయిన్‌ అన్న భావం ప్రభాస్ అభిమానులలో ఉంది. దీనికితోడు ఈమధ్య ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి అన్న సెంటిమెంట్ కూడ ప్రభాస్ అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్. శ్రద్ధ కపూర్ వల్ల అటు బాలీవుడ్‌లో అడ్వాంటేజ్‌ రాకపోగా ఇటు తెలుగులో కూడా హీరోయిన్‌ వీక్‌ అనిపించుకునే అవకాశముంది అని ప్రభాస్ అభిమానులు కలవర పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో ‘సాహో’ టీమ్‌ బాలీవుడ్‌ నుంచి టాప్‌ యాక్టర్లని రంగంలోకి దింపలేకపోయిందని విలన్‌గా నీల్‌ నితిన్‌ ముఖేష్‌ నటిస్తూ ఉన్నా ఈ చిత్రానికి ఇక ప్రభాసే సర్వం కాబట్టి కేవలం ప్రభాస్ మ్యానియా ‘సాహో’ ను ఎంతవరకు కాపాడుతుంది అన్న భయాలు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ను భయపడుతున్నట్లు తెలుస్తోంది..