Asianet News TeluguAsianet News Telugu

‘కప్పేల’ తెలుగు రీమేక్ టైటిల్,బన్ని సినిమాతో లింక్

 అయ్య‌ప్ప‌న‌మ్ కోషియుమ్ సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో రీమేక్ చేస్తున్న సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మ‌రో మ‌ల‌యాళ సినిమాను రీమేక్ చేస్తుంది. ఆ సినిమానే క‌ప్పేలా. హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. 

Kappela remake to get a crazy title? jsp
Author
Hyderabad, First Published Jul 8, 2021, 1:51 PM IST

మలయాళంలో ఘన విజయం అందుకున్న ‘కప్పేల’ చిత్రం తెలుగులో రీమేక్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. సిద్ధు జొన్నల గడ్డ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శారి చంద్రశేఖర్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ హాజరై, క్లాప్‌నిచ్చారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఏమి టైటిల్ పెట్టి ఉంటారనేది ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు బుట్టబొమ్మ అనే టైటిల్ పెట్టారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో సూపర్ హిట్టైన పాట నుంచి ఈ టైటిల్ ని తీసుకున్నట్లు సమాచారం. అయితే అదే టైటిల్ అని అధికారిక సమాచారం అయితే ఏమీ లేదు. ‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ప్రేమలోని పలు పార్శ్వాలను స్పృశిస్తూ కథ, కథనాలు ఉంటాయి. ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఇతర తారాగణం వివరాలు, టైటిల్‌ త్వరలోనే ప్రకటిస్తాం’ అని తెలిపారు చిత్ర దర్శకుడు. 
  
 చిత్రం గ్రామీణ నేపథ్యంతో సున్నితమైన, భావోద్వేగమైన ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. ప్రేమ పేరుతో మోసగించబడే యువతకు కనువిప్పు కలిగించేలా ఈ చిత్రం రూపొందింది. అన్నా బెన్, శ్రీనాథ్ భసీ, రోషన్ మ్యాథ్యూ లాంటి యువ నటుల ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. మహ్మద్ ముస్తాఫా తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమై మంచి విజయాన్ని, ప్రశంసలను అందుకొన్నారు. ఈ చిత్రం గురించి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ లాంటి సోషల్ మీడియాలో ప్రస్తావించడం ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.

చిత్రం కథేమిటంటే...గ్రామీణ ప్రాంత యువతి జెస్సీ (అన్నా బెన్) విష్ణు అనే ఆటో డ్రైవర్‌తో ప్రేమలో పడుతుంది? ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉండటంతో విష్ణుతో కలిసి జెస్సీ ఊరి నుంచి లేచిపోతుంది. అలా పట్నం చేరిన జెస్సీకి విష్ణు నిజ స్వరూపం తెలుస్తుంది? ఆ క్రమంలో విష్ణు నుంచి తప్పించుకోవాలని చూసే క్రమంలో ఆమెను బెన్నీకాపాడుతాడు. విష్ణు ఎవరు? జెస్సీని ఎందుకు కాపాడారు అనే ప్రశ్నలకు సమాధానమే కపేలా సినిమా కథ.

సాంకేతిక నిపుణులు:
ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు
సంగీతం: స్వీకార్ అగస్తి
మాటలు: గణేష్ కుమార్ రావూరి
ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి 

Follow Us:
Download App:
  • android
  • ios