అమ్మకానికి ఆర్కే స్టూడియోస్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 27, Aug 2018, 2:17 PM IST
kapoor family ready to sell rk studios
Highlights

బాలీవుడ్ కు చెందిన ఆర్కే స్టూడియోస్ ను అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. బాలీవుడ్ స్టార్, నిర్మాత అయిన రాజ్ కుమార్ నిర్మించిన ఈ స్టూడియోస్ లో గతేడాది భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

బాలీవుడ్ కు చెందిన ఆర్కే స్టూడియోస్ ను అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. బాలీవుడ్ స్టార్, నిర్మాత అయిన రాజ్ కుమార్ నిర్మించిన ఈ స్టూడియోస్ లో గతేడాది భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. తిరిగి పునర్నిర్మించాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం స్టూడియోని అమ్మేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ఈ విషయంపై రాజ్ కుమార్ తనయుడు రిషి కపూర్ మాట్లాడుతూ.. 'మాకు ఈ స్టూడియోస్ తో ఎమోషనల్ బాండింగ్ ఉంది. కానీ ఆర్ధిక కారణాల వలన ఈ స్టూడియోస్ ని అమ్మేయాలని కుటుంబసభ్యులమంతా నిర్ణయించుకున్నాం. స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగిన తరువాత మళ్లీ పునర్నిర్మించేందుకు ప్రయత్నించాం. కానీ దానికి భారీగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే ఈ స్టూడియో నష్టాల్లో నడుస్తోంది. ఒకవేళ స్టూడియోని బాగు చేసినా.. లాభాలు వస్తాయనే నమ్మకం కూడా లేదు.

అందుకే అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చాము. ఈ స్టూడియోలో సీరియల్స్, చిన్న చిన్న సినిమాల నిర్మాణం జరుగుతున్నా.. మాకు మాత్రం లాభాలు రావడం లేదు. అప్పట్లో కొత్త టెక్నాలజీతో ఈ స్టూడియోస్ ని అప్ గ్రేడ్ చేయాలని భావించాం.కానీ ఆర్థికంగా వనరులు లేకపోవడంతో వెనక్కి తగ్గాము' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ స్టూడియోస్ ని కమర్షియల్ అవసరాలకు కాకుండా.. ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అలానే ఉంచితే బాగుంటుందని.. లేదంటే రాజ్ కుమార్ జ్ఞాపకాలు పోగొట్టుకుంటామంటూ అభిమానులు అంటున్నారు. 

loader