దివంగత నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నేటితో 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. తల్లిని కోల్పోయిన విషాదంలో ఉన్న జాహ్నవి కపూర్‌కు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషెర్స్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం తల్లి తో అంగరంగ వైభవంగా సెల్ బ్రేషన్స్ చేసుకునే జాహ్నవి కానీ ఈ పుట్టిన రోజు శ్రీదేవిని తల్చుకుంటు అనదాశ్రమంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న జాహ్నవి.

నిన్న జరిగిన ఆమె బర్త్ డేకి పెద్దగా బయటవారిని ఎవ్వరినీ పిలవలేదు. కేవలం జాన్వీ కుటుంబం, ఆమె సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. వారందరి సమక్షంలోనే ఆమె కేక్ కట్ చేసి 21వ వసంతంలోకి ప్రవేశించింది.  


'కపూర్ అండ్ డాటర్స్' పేరుతో సోనమ్ ఈ ఫొటోని పోస్టు చేసింది. ఇందులో బోనీ కపూర్ కుమార్తెలు జాన్వీ, ఖుషీ, అన్షుల కపూర్‌లు కొవ్వొత్తులు, కేక్‌ల మధ్య ఉన్న సీన్ కెమేరాల్లో బందీ అయింది. ఈ ఫొటోలో సోనమ్, రియా, షనాయా, అన్షుల కపూర్, బోనీ కపూర్‍‌ని చూడవచ్చు.అయితే దీనికి ముందు రోజు ముంబాయిలోని ఒక ఓల్డేజ్ హోమ్ కి వెళ్లి అక్కడ వాళ్లతో తన పుట్టినరోజును కేక్ కట్ చేస్తు సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.