కపిల్ శర్మ షో అంటే నార్త్ లో తెలియని వారుండరు. అలాగే సౌత్ లో కూడా ఆ షో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కపిల్ శర్మ తన కామెడీ టైమింగ్ తో లైవ్ లోనే కడుపుబ్బా నవ్వించగలడని ఒక స్పెషల్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. ఇకపోతే ఈ కమెడియన్ ఇప్పుడు ఒక ఇంటివాడయ్యాడు. 

గత కొన్నేళ్లుగా గిన్ని ఛత్రాత్ అనే అమ్మాయితో కపిల్ లవ్ ను కొనసాగిస్తున్నాడు. గతంలోనే వీరి పెళ్లికి సంబందించిన వార్తలు చాలా వచ్చాయి. అయితే ఫైనల్ గా బుధవారం ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. జలంధర్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే కపిల్ పెళ్లికి కేవలం సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 

నెక్స్ట్ సెలబ్రెటీలను ఆహ్వానించి రిసెప్షన్స్ పార్టీని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ మధ్య సంగీత్ మెహందీ వంటి ఫంక్షన్స్ జరుపుకున్నప్పటికీ కపిల్ పోటోలను విడుదల చేయలేదు. కానీ మొదటిసారి వివహం జరిగిన అనంతరం దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫొటో షేర్ చేస్తున్న కపిల్ అభిమానులు కొత్త దంపతులకు విషెష్ అందిస్తున్నారు.