పరిచయం అవసరం లేని పేరు కపిల్ శర్మ. ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకునే కమెడియన్ గా కపిల్ శర్మ కొనసాగుతున్నారు. కపిల్ శర్మ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకు విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. తరచుగా ఎదురయ్యే వివాదాలు కపిల్ శర్మ క్రేజ్ ని అడ్డుకోలేకున్నాయి. గత ఏడాది కపిల్ శర్మ తన ప్రియురాలు జిన్ని ఛత్రాత్ ని వివాహం చేసుకున్నాడు. 

త్వరలో కపిల్ శర్మ తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. జిన్ని ఛత్రాత్ ప్రస్తుతం గర్భవతి. దీనితో కపిల్ శర్మ ఫ్యామిలీ సంతోషంలో మునిగితేలుతోందట. కపిల్ శర్మ, జిన్ని ఛత్రాత్ అన్యోన్యంగా జీవిస్తున్నారు. కపిల్ శర్మ సహ నటి భారతి సింగ్ అతడి భార్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కపిల్ శర్మ ఆరోగ్యం విషయంలో ఛత్రాత్ చాలా కేర్ తీసుకుంటుంట. 

కపిల్ శర్మ షూటింగ్ విషయంలో సమయపాలన పాటిస్తాడు. షూటింగ్ ముగియగానే ఇంటికి వెళ్ళిపోతాడు. నిజంగా అలాంటి భర్తని పొందిన ఛత్రాత్ అదృష్టవంతురాలు. ఆ అదృష్టం కపిల్ శర్మది కూడా. ఎదుకంటే ఆమె ఎప్పుడూ కపిల్ శర్మని బయట భోజనం చేయనీయదు. ప్రతిరోజు ఇంటిభోజనమే సెట్స్ కు పంపుతుంది. ఆ క్రమంలో కపిల్ శర్మ ఇంటి నుంచి మాకు కూడా భోజనం అందుతుందని భారతి సింగ్ తెలిపింది. కపిల్ శర్మ బెస్ట్ స్టాండప్ కమెడియన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో స్థానం దక్కించుకున్నాడు.