మరో క్రీడాకారుడి లైఫ్ పై బయోపిక్

kapil dev biopic soon with ranveer
Highlights

  • కపిల్ దేవ్ లైఫ్ ఆధారంగా బాలీవుడ్ మూవీ
  • ఈ బయోపిక్ లో రణ్ వీర్ సింగ్ హీరో
  • 1983లో క్రికెట్ వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్

 

కోట్లాది మంది అభిమానం సంపాదించుకుని రియల్ లైఫ్ హీరోలుగా.. అందరికీ ఇనిస్పిరేషన్ గా నిలుస్తున్న ఎంతోమంది జీవితాల్లోని ఆ సక్సెస్ వెనుకున్న కథను.. ఆస్థాయికి చేరుకున్న వైనాన్ని వెండితెరపై ఆవిష్కరించడం ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. ఇప్పటికే క్రికెట్ దేవుడు సచిన్, ధోని, మేరీకోమ్, మిల్కాసింగ్ లాంటి క్రీడాకారులపై తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అదే బాటలో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ లైఫ్ స్టోరీని కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో క దిగ్గజ క్రీడాకారుడు జీవిత చరిత్ర వెండితెరకు ఎక్కబోతోంది.
 


భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నారు. అయితే కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్ సింగ్, అర్జున్ కపూర్‌లలో ఎవరో ఒకరు నటిస్తారని మొదట్లో టాక్ వినిపించింది. అయితే దీనిపై చాలా రోజులు అనేక రూమర్లు నడిచాయి. మొత్తానికి స్పష్టత వచ్చింది. కపిల్‌దేవ్ పాత్రను ఎవరు పోషిస్తున్నారో అధికారికంగా వెల్లడైంది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్‌.. కపిల్‌దేవ్ పాత్ర పోషించనున్నాడు.చిన్నతనం నుంచి చరిత్రాత్మక 1983 ఐసీసీ ప్రపంచకప్ విజయం వరకు ఉన్న కపిల్ ప్రయాణాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించనున్నారు. ప్రస్తుతం రణ్‌వీర్ ‘పద్మావతి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రాణి పద్మినిగా దీపికా పదుకొనే, రాజా రవల్ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రణ్‌వీర్ అతి పరాక్రమశాలి అల్లావుద్దీన్ ఖిల్జీగా కనిపించనున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ‘పద్మావతి’ పూర్తయిన తరవాత కపిల్‌దేవ్ బయోపిక్ ప్రారంభమవుతుంది. ‘బజరంగీ భాయీజాన్’, ‘సుల్తాన్’, ‘ఏక్తా టైగర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన కబీర్ ఖాన్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

loader