Asianet News TeluguAsianet News Telugu

తెలుగులో 50 డేస్ పూర్తి చేసుకున్న కాంతార మూవీ, స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ

తెలుగులో 50 రోజులు పూర్తి చేసుకుంది కాంతార  సినిమా. ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతోంది. థియేటర్లలో ఎంత రెస్పాన్స్ సాధించిందో.. అంతకంటే ఎక్కువగా  ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది .

kantara movie Completes 50 Days in Telugu
Author
First Published Dec 4, 2022, 9:49 AM IST

తెలుగులో 50 రోజులు పూర్తి చేసుకుంది కాంతార  సినిమా. ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతోంది. థియేటర్లలో ఎంత రెస్పాన్స్ సాధించిందో.. అంతకంటే ఎక్కువగా  ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.


రిషబ్ శెట్టి  నటించి దర్శకత్వం వహించిన కాంతారా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ జోరు కొనసాగిస్తోంది. నటుడు, రచయిత మరియు దర్శకుడిగా రిషబ్ శెట్టికి పాన్ ఇండియా లెవల్లో మంచి పేరు కూడా వచ్చింది. బాలీవుడ్ నుంచి సౌత్ స్టార్స్ వరకూ అందరిని తన సినిమాతో ఇంప్రెస్ చేశాడు రిషబ్. 

ఇక తెలుగులో ఈ సినిమా 50రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన  స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేవారు మూవీ టీమ్. తెలుగులో ఈ సినిమాను గీతాఆర్ట్స్  సంస్థ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసింది. అక్టోబర్ 15వ తేదీన తెలుగులో రిలీజ్ అయిన ఈమూవీ తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత నుంచి చాలా రోజుల పాటు అదే వసూళ్ల జోరును కొనసాగించింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.కన్నడలో ఎంత రెస్పాన్స్ వచ్చిందో.. తెలుగులో కూడా అంతే రెస్పాన్స్ ను సాధించింది ఈ సినిమా. 

 

కన్నడ నాట మామూలు సినిమాగా సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యింది కాంతార సినిమా. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినఈసినిమా అనూహ్య విజయం.. అద్భుత రెస్పాన్స్ సాధించడంతో.. ఓవర్ ఆల్ గా 400 కోట్ల కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకుంది. ఇటు ఓటీటీలో కూడా సూపర్ హిట్ అయ్యింది కాంతార మూవీ. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈసినిమాకు ఇప్పటికీ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.  

ఇక కాంతార సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు క‌న్న‌డ‌ హీరో రిష‌బ్‌ శెట్టి. ఈ సినిమాలో అత‌ని న‌ట‌న‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. రజనీ కాంత్ ఇంటికి పిలిచి మరీ అభినందించి.. గోల్డ్ చైన్ భహుమతిగా అందించాడు. అంతేకాదు ఈ మూవీకి ద‌ర్శ‌కుడిగా  కూడా మంచి మార్కులు కొట్టేశాడు రిషబ్. ఇక తెలుగులో గీతా ఆర్ట్స్ నుంచి అద్భుతమైన ఆఫర్ కూడా అందుకున్నాడు రిషబ్. సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ స్వయంగా ప్రకటిస్తూ.. గీతాఆర్ట్స్ లో సినిమా చేయాలని కోరుతున్నట్టు ప్రకటించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios