వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి 'తమ్ముడు' అనే క్రేజీ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు.
క్రేజీ హీరో నితిన్ వరుస చిత్రాలతో బిజీ అయిపోతున్నాడు. నితిన్ నటించిన ఎక్స్ట్రా చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించాల్సి ఉంది. ఈ లోపు నితిన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రారంభించాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీకి 'తమ్ముడు' అనే క్రేజీ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ కావడంతో నితిన్, వేణు శ్రీరామ్ ప్రాజెక్టు పై ఫ్యాన్స్ లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అదిరిపోయే యాక్షన్ అంశాలతో వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ మూవీలో నితిన్ కి జోడిగా కాంతార హీరోయిన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. కాంతార చిత్రంలో నటి సప్తమి గౌడ సహజ సిద్దమైన నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాంతార మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో సప్తమికి కూడా గుర్తింపు దక్కింది.
తమ్ముడు చిత్రంలో సప్తమికి ఆఫర్ దక్కితే ఈ యంగ్ బ్యూటీకి అది క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి.నితిన్ తమ్ముడులో సప్తమి గౌడ దాదాపు ఖాయం అని అంటున్నారు. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సప్తమి గౌడ.. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న వాక్సిన్ వార్ చిత్రంలో సైతం నటిస్తోంది.
